గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్. వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 10న పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్‌గా విడుదలవుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ రెస్పాన్స్ అందుకుంది. అలాగే ‘జరగండి, రా మచ్చా, నానా హైరానా’ అనే మూడు లిరికల్ సాంగ్స్‌ను విడుదల చేయగా, అవి మ్యూజిక్ లవర్స్‌ని బాగా ఇంప్రెస్ చేశాయి. దీంతో మూవీపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం గురించి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ అందింది.
ఎర్లీ రిపోర్ట్స్ ప్రకారం, గేమ్ ఛేంజర్ సినిమా అదిరిపోనుందట. ఇందులో యాక్షన్, ఎమోషన్ పర్‌ఫెక్ట్‌గా సెట్ అయ్యాయని టాక్. క్వాలిటీ పరంగా ప్రతి ఫ్రేమ్ రిచ్‌గా, గ్రాండియర్‌గా ఉండనుంది. సాధారణంగానే శంకర్ సినిమాలలో విజువల్స్, టెక్నాలజీ అద్భుతంగా ఉంటాయి. పాటలలో అయితే ఈ నిండుతనం మరింత ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే యాక్షన్ సీన్స్ కూడా భారీగా ఉంటాయి.
ఈ చిత్రం కూడా ఈ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉండనుంది. యూనిట్ వర్గాల ప్రకారం, గేమ్ ఛేంజర్‌లో సాలిడ్ ఫస్టాఫ్.. థ్రిల్లింగ్ సెకండాఫ్ ప్లాన్ చేశాడట శంకర్. కార్తీక్ సుబ్బరాజ్ అందించిన కథ మేరకు మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు, స్క్రీన్ ప్లే మ్యాజిక్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. క్లైమాక్స్ అయితే ఎవరూ ఊహించని విధంగా, రామ్ చరణ్‌ని హై రేంజ్‌లో చూపించనున్నారు. మొత్తానికి శంకర్, రామ్ చరణ్ ఫస్ట్ కాంబో సాలిడ్ హిట్ అందుకోనుందనేది సుస్పష్టం.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: