తెలుగు సినీ నటుడు అక్కినేని నాగార్జున, తనయుడు నాగచైతన్య-శోభిత దంపతులు శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించారు. ఈ మేరకు శుక్రవారం కొండపైకి చేరుకున్న వీరికి ఆలయ మర్యాదలతో ఆలయ అర్చకులు, అధికారులు ఘనంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా వారు భ్రమరాంబిక మల్లికార్జున స్వామివార్లను దర్శించుకున్నారు. కాగా నాగచైతన్య శోభిత కొత్తగా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో వివాహం అయిన తర్వాత నూతన దంపతులు మొదటిసారిగా మల్లన్న సన్నిధికి రావడం విశేషం. ఈ సందర్భంగా మల్లన్నకు అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చనలు వంటి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఆలయ ముఖ మండపం వద్ద వేద పండితుల ఆశీర్వచనాలను, లడ్డు ప్రసాదాలను స్వీకరించారు.
మరోవైపు సినీ హీరో నాగార్జున, నాగచైతన్య, శోభితలను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు, భక్తులు తరలివచ్చారు. వీళ్ళ రాకతో శ్రీశైలం క్షేత్రమంతా సందడి వాతావరణం నెలకొంది. ఇదిలావుంటే, నాగచైతన్య ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో ‘తండేల్’ అనే చిత్రంలో నటిస్తుండగా.. లోకేష్ కనగరాజ్-రజనీకాంత్ కాంబోలో వస్తోన్న ‘కూలీ’ సినిమాలో నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ మూవీస్ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: