ఊహించినట్లుగానే అల్లు అర్జున్ పుష్ప 2 నార్త్ లో దుమ్ము రేపుతోంది.నిన్న థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకోవడంతో మొదటి రోజు రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ ను రాబట్టుకుంది.తొలి రోజు ఏకంగా 72కోట్ల నెట్ వసూళ్లను రాబట్టి హిందీలో అత్యధిక ఓపెనింగ్స్ ను రాబట్టిన సినిమాగా చరిత్ర సృష్టించింది.ఓ డబ్బింగ్ సినిమా ఈ ఫీట్ సాధించడం గొప్ప విషయం.ఇంతకుముందు షారుక్ ఖాన్ జవాన్ 65.50కోట్ల ఓపెనింగ్స్ ను రాబట్టి అక్కడ మొదటి స్థానంలో ఉండేది.ఇప్పుడు ఆ రికార్డు ను బ్రేక్ చేసి మొదటి స్థానంలో నిలిచింది తెలుగు సినిమా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈరోజు కూడా అడ్వాన్స్ బుకింగ్ సూపర్ గా వున్నాయి.వర్కింగ్ డే కావడంతో కొంచెం డ్రాప్ అయినా 40కోట్ల నుండి 50కోట్ల వరకు రాబట్టుకోనుంది. రేపటి నుండి రాంపేజ్ కొనసాగనుంది.ఈ వీకెండ్ కి పుష్ప 2 అక్కడ 200కోట్ల మార్క్ దాటనుంది.ఇంతకుముందు పుష్ప ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి హిందీలో విడుదలై 100 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.ఈసినిమాతో పుష్ప 2పై అంచనాలు పెరిగిపోయాయి.ఇక ఇప్పుడు హైప్ కి తగ్గట్లు జోరు చూపిస్తుంది.ఫుల్ రన్ లో అక్కడ ఎంత రాబట్టుకునేది ఆసక్తిగా మారింది.
సుకుమార్ ఈసినిమాను డైరెక్ట్ చేయగా రష్మిక మందన్న కథానాయికగా నటించింది.రావు రమేష్,జగపతి బాబు ,జగదీష్ కీలక పాత్రల్లో కనిపించారు.రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ ఈసినిమాను నిర్మించింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: