ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా, నేషనల్ క్రష్ రష్మిక మందన్నతో జంటగా, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప 2: ది రూల్’. డిసెంబర్ 5వ తేదీన భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఎలమంచిలి నిర్మాతలుగా పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 12,000 స్క్రీన్లలో పెద్ద ఎత్తున రిలీజ్ అవుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రంలో సునీల్, ఫహాద్ ఫాసిల్, జగపతి బాబు, రావు రమేష్, అనసూయ భరద్వాజ్, ధనుంజయ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన టీజర్, ట్రైలర్, నాలుగు లిరికల్ పాటలు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి. ఇప్పటికే పాట్నా, చెన్నై, కొచ్చి, ముంబై నగరాలలో జరిగిన ఈవెంట్లకు ప్రేక్షకుల నుండి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా సోమవారం హైదరాబాద్‌లో ఈ చిత్ర ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది.
ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పుష్ప 2 టికెట్ల ధరలను పెంచుకోవడానికి మరియు బెనిఫిట్ షోలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వగా, తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా దీనిపై జీవో జారీ చేసింది. దీని ప్రకారం తెలుగు రాష్ట్రాలలో పుష్ప 2 చిత్రం టికెట్ల రేట్లు ఇలా ఉన్నాయి.
ఏపీలో పుష్ప 2 టికెట్ రేట్స్..
- డిసెంబర్ 4వ తేదీ రాత్రి 9.30 గంటల బెనిఫిట్ షోతో పాటు, అర్ధరాత్రి 1 గంట షోలకు అనుమతి.
- రాత్రి 9.30 బెనిఫిట్ షోకు సింగిల్ స్క్రీన్, మల్టీఫ్లెక్స్ లలో టికెట్ ధర రూ.800గా నిర్ణయించారు.
- రిలీజ్ రోజు డిసెంబర్ 5న ఆరు షోలకు అనుమతి.
- 5వ తేదీన సింగిల్ స్క్రీన్‌లలో జీఎస్టీ ఛార్జీలతో కలిపి లోయర్ క్లాస్ టికెట్ రూ.100 వరకూ పెంపు.
- జీఎస్టీ ఛార్జీలతో కలిపి అప్పర్ క్లాస్ టికెట్ రూ.150 వరకూ పెంపు.
- మల్టీప్లెక్స్‌లో టికెట్ రూ.200 వరకూ పెంపు.
- డిసెంబర్ 6 నుంచి 17వ తేదీ వరకు రోజుకు ఐదు షోలకు అనుమతి.
తెలంగాణలో పుష్ప 2 టికెట్ రేట్స్..
- డిసెంబర్ 4వ తేదీ రాత్రి 9.30 గంటలకు, అర్ధరాత్రి 1.00 గంటకు బెనిఫిట్ షోలకు అనుమతి.
- ఈ బెనిఫిట్ షోల టికెట్ ధరలు సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్‌లో ప్రస్తుతం ఉన్న టికెట్ రేటుపై అదనంగా రూ.800 పెంపు.
- రిలీజ్ రోజైన డిసెంబర్ 5న 7షోస్.
- డిసెంబర్ 6 నుంచి 23వ తేదీ వరకు 5షోలకు అనుమతి.
- డిసెంబర్ 5నుంచి 8వ తేదీ వరకు జీఎస్టీ ఛార్జీలతో కలిపి సింగిల్ స్క్రీన్స్ రూ.150.
- జీఎస్టీ ఛార్జీలతో కలిపి మల్టీ ఫ్లెక్స్ లలో రూ.200 వరకూ పెంపు.
- ఆ తరువాతి 8 రోజులకు సింగిల్ స్క్రీన్ రూ.105 వరకూ పెంపు.
- అలాగే మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ.150 వరకూ పెంపు.
- ఆ తరువాతి 11 రోజులకి సింగిల్ స్క్రీన్ రూ.20 వరకూ పెంపు.
- మల్టీ ఫ్లెక్స్ రూ.50 వరకూ పెంపుకు పర్మిషన్.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: