వెంకటేష్ ,అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న మూడో సినిమా సంక్రాంతికి వస్తున్నాం.సంక్రాంతికి థియేటర్లలలోకి రానుంది.ఈసినిమా షూటింగ్ కూడా ఆల్మోస్ట్ పూర్తయినట్లే. ఇక ప్రమోషన్స్ లో భాగంగా నిన్న ఈసినిమా నుండి మొదటి పాటను రిలీజ్ చేశారు. గోదారి గట్టు అంటూ వచ్చిన ఈసాంగ్ యూనానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. చాలా రోజుల తరువాత ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల వోకల్స్ తో వచ్చిన ఈసాంగ్ రిపీట్ వాల్యూ తెచ్చుకుంటుంది. ఇప్పటివరకు యూట్యూబ్ లో 3మిలియన్లకు కుపైగా వ్యూస్ ను రాబట్టుకుంది.రమణ గోగుల తోపాటు మధుప్రియ ఈ సాంగ్ ను పాడగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు.భాస్కర్ భట్ల ఈపాటను రచించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మొత్తానికి ఒక్క సాంగ్ తో సినిమాపై అంచనాలు పెంచేశారు.బుక్ మై షో లో ఇంట్రెస్ట్స్ 50వేలు దాటాయి.ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేసుకొని సంక్రాంతి బరిలోకి దిగుతుంది ఈసినిమా.ఇందులో ఐశ్వర్య రాజేష్ ,మీనాక్షి చౌదరి హీరోయిన్లు గా నటిస్తుండగా రాజేంద్ర ప్రసాద్ ,సాయి కుమార్, వీటివి గణేష్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.దిల్ రాజు నిర్మిస్తున్నారు.జనవరి 14న సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ కానుంది.
ఇక వెంకటేష్ ,అనిల్ రావిపూడి ,దిల్ రాజు కాంబినేషన్ లో ఇంతకుముందు వచ్చిన ఎఫ్ 2 ,ఎఫ్ 3 బ్లాక్ బాస్టర్ లు అయ్యాయి.మరి సంక్రాంతికి వస్తున్నాంతో హ్యాట్రిక్ కొడతారో చూడాలి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: