పుష్ప 2.. అవార్డ్స్ అన్నీ వారిద్దరికే ఇవ్వాలి

Ace Producer Allu Aravind Shares His Experience of Watching Pushpa 2

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా, నేషనల్ క్రష్ రష్మిక మందన్నతో జంటగా, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప 2: ది రూల్’. డిసెంబర్ 5వ తేదీన భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఎలమంచిలి నిర్మాతలుగా పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 12,000 స్క్రీన్లలో పెద్ద ఎత్తున రిలీజ్ అవుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రంలో సునీల్, ఫహాద్ ఫాసిల్, జగపతి బాబు, రావు రమేష్, అనసూయ భరద్వాజ్, ధనుంజయ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన టీజర్, ట్రైలర్, నాలుగు లిరికల్ పాటలు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి. ఇప్పటికే పాట్నా, చెన్నై, కొచ్చి, ముంబై నగరాలలో జరిగిన ఈవెంట్లకు ప్రేక్షకుల నుండి హ్యూజ్ రెస్పాన్స్ రావడం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా సోమవారం హైదరాబాద్‌లో ఈ చిత్ర ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది.

ఈ సందర్భంగా వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గారు ఈ సినిమా చూసిన తర్వాత తన అనుభవం గురించి పంచుకున్నారు. అరవింద్ గారు ఏమన్నారో ఆయన మాటల్లోనే.. “అందరికి నమస్కారం. నేను ఒక వారం రోజుల క్రితం సినిమా చూడటం జరిగింది. చూసి ఇంటికి వెళ్ళిన తర్వాత నా భార్య ఎందుకు మొహం ఇంత వెలిగిపోతుంది అని అడిగారు. మగధీర ముందు మీ మొహం ఇంత వెలిగిపోవడం చూశాను. మళ్లీ ఇప్పుడు చూస్తున్నాను అని ఆమె అన్నారు.”

“అల్లు అర్జున్ భార్య స్నేహ, సుకుమార్ భార్య భబితకు అవార్డులు అన్నీ ఇచ్చేయాలి. ఎందుకంటే 5 సంవత్సరాల పాటు ఇంతగా సపోర్ట్ చేసినందుకు. అలాగే ఈ సినిమాలో నేను తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేసిన హీరోయిన్ రష్మిక గురించి మాట్లాడాలి. ఎంత బాగా నటించింది అంటే పుష్ప 1 సినిమాలో ఆమె నటన ఈ సినిమాతో పోలిస్తే చాలా తక్కువ అని చెప్పుకోవాలి. ఈ సినిమాలో అంత బాగా చేసింది.”

“ఇక శ్రీలీల ఉండేది తక్కువ సమయమైనా చాలా బాగా ఇంపాక్ట్ చూపిస్తుంది. అలాగే దేవిశ్రీ ప్రసాద్ నాకు తన చిన్నతనం నుండి తెలుసు. తన తండ్రి నా స్నేహితుడు. తను ఇంత మంచి హిట్స్ కొట్టడం ఆశ్చర్యంగా ఉంది. ఒక నిర్మాతగా నేను చెప్తున్నాను మైత్రి మూవీ మేకర్స్ దేశంలోనే అతిపెద్ద నిర్మాతలు. వారు ఇన్ని సినిమాలు ఇంత పర్ఫెక్ట్ గా ఎక్కడ ఒక కంప్లైంట్ కూడా లేకుండా ఎలా చేస్తారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. అందరికీ ఆల్ ద బెస్ట్” అంటూ ముగించారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.