అప్పుడు వెంటనే అల్లు అరవింద్ గారి వైపు చూస్తాను

Rock Star Devi Sri Prasad Interesting Comments on Ace Producer Allu Aravind

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా, నేషనల్ క్రష్ రష్మిక మందన్నతో జంటగా, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప 2: ది రూల్’. డిసెంబర్ 5వ తేదీన భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఎలమంచిలి నిర్మాతలుగా పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 12,000 స్క్రీన్లలో పెద్ద ఎత్తున రిలీజ్ అవుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రంలో సునీల్, ఫహాద్ ఫాసిల్, జగపతి బాబు, రావు రమేష్, అనసూయ భరద్వాజ్, ధనుంజయ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన టీజర్, ట్రైలర్, నాలుగు లిరికల్ పాటలు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి. ఇప్పటికే పాట్నా, చెన్నై, కొచ్చి, ముంబై నగరాలలో జరిగిన ఈవెంట్లకు ప్రేక్షకుల నుండి హ్యూజ్ రెస్పాన్స్ రావడం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా సోమవారం హైదరాబాద్‌లో ఈ చిత్ర ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది.

ఈ సందర్భంగా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ.. “అందరికి నమస్కారం. ఈరోజు పుష్ప ఈ స్థాయిలో ఉండటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో పనిచేసినందుకు ఎంతో గర్వంగా ఉంది. ముందుగా పుష్ప 1 నుండి పుష్ప 2 వరకు పనిచేసిన నా టీంకు ధన్యవాదాలు తెలపాలి అనుకుంటున్నాను. అలాగే మమ్మల్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకుని వెళ్లిన దర్శకుడు సుకుమార్ కు నా ప్రత్యేక ధన్యవాదాలు” అని పేర్కొన్నారు.

“అలాగే చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలకు పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమాలో ఇంత మంచి పాటలు అందించిన చంద్రబోస్ గారికి నా ధన్యవాదాలు. అలాగే మిగతా భాషలలో ఆ పాటలు అంత బాగా వచ్చేలా రాసిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. సినిమాలో నటించిన రష్మిక మందన్న, అలాగే కిస్సిక్ సాంగులో పర్ఫార్మ్ చేసిన శ్రీలీలకు నా ధన్యవాదాలు” అని తెలిపారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “అందరికీ ఈ సాంగ్స్ నచ్చినట్లు తెలుస్తుంది. అలాగే నా చిన్ననాటి స్నేహితుడు అల్లు అర్జున్ గురించి చెప్పాలి అంటే.. తన గురించి ఎవరు ఎప్పుడు ఏం మాట్లాడుతున్నా కూడా నేను వెంటనే అల్లు అరవింద్ గారి వైపు చూస్తాను. ఎందుకంటే మనకంటే ఎక్కువగా మన తండ్రులు గర్వంగా ఫీల్ అవుతారు. నాకింత ఆదరణ చూపిస్తున్న అందరికీ నా ధన్యవాదాలు. చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్” అని చెప్పారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.