ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా, నేషనల్ క్రష్ రష్మిక మందన్నతో జంటగా, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప 2: ది రూల్’. డిసెంబర్ 5వ తేదీన భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఎలమంచిలి నిర్మాతలుగా పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 12,000 స్క్రీన్లలో పెద్ద ఎత్తున రిలీజ్ అవుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రంలో సునీల్, ఫహాద్ ఫాసిల్, జగపతి బాబు, రావు రమేష్, అనసూయ భరద్వాజ్, ధనుంజయ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన టీజర్, ట్రైలర్, నాలుగు లిరికల్ పాటలు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి. ఇప్పటికే పాట్నా, చెన్నై, కొచ్చి, ముంబై నగరాలలో జరిగిన ఈ చిత్ర ఈవెంట్లకు ప్రేక్షకుల నుండి హ్యూజ్ రెస్పాన్స్ రావడం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా సోమవారం హైదరాబాద్‌లో ఈ చిత్ర ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది.
ఈ సందర్భంగా చిత్ర కథానాయిక నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరో అల్లు అర్జున్ మరియు దర్శకుడు సుకుమార్ ఇద్దరినీ ఆకాశానికి ఎత్తేశారు. రష్మిక ఏమన్నారో ఆమె మాటల్లోనే.. “అందరూ బాగున్నారా? మేము దేశం వ్యాప్తంగా ఈ సినిమా ప్రమోట్ చేయడానికి తిరిగాము. కానీ నేను ఎక్కడ ఎక్కువగా మాట్లాడలేదు. ఈరోజు కొంచెం టైం తీసుకుని అయినా మాట్లాడుతాను. పుష్ప 1 చేస్తున్నప్పుడే పుష్ప 2లో ఇంతకంటే బాగా చేయాలని సుకుమార్ గారి దర్శకత్వంలో అల్లు అర్జున్ గారితో నటిస్తూ నా పూర్తి పెర్ఫార్మన్స్ ఇవ్వడం జరిగింది.”
“ఈరోజు నేను ఇలా నటిస్తున్నాను అంటే అది కేవలం సుకుమార్ గారు, అల్లుఅర్జున్ గారి వల్లే. సుకుమార్ గారు సాధారణంగా చాలా సైలెంట్ గా ఉంటారు. పుష్ప 1 చేసేటప్పుడు ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అనుకున్నాను. కానీ పుష్ప 2 సమయంలో చాలా సౌకర్యంగా ఫీల్ అవుతూ మాట్లాడుకునేవాళ్లం. సుకుమార్ గారి దర్శకత్వంలో ఇంకొక సినిమాకు అవకాశం వస్తుందని ఆశిస్తున్నాను. సుకుమార్ గారు అంటే నాకు అంత ఇష్టం.”
“ఈ సినిమాతో ఆయన ఎంత కష్టపడుతున్నారు అనేది అందరికీ కనిపిస్తుంది. ఈ సినిమాతో మీరు ఈ రాష్ట్ర దేశ సరిహద్దులు దాటి అంతర్జాతీయ స్థాయిలో నిలిచిపోవాలని కోరుకుంటున్నాను. అలాగే మైత్రి మూవీ మేకర్స్ తో పనిచేయడం నాకు ఎంత సంతోషంగా ఉంది. మరిన్ని సినిమాలు మీతో కలిసి చేయడానికి నేను మీకు చూస్తాను. ఈ సినిమా మంచి హిట్ అయ్యి మీకు డబ్బులు తీసుకురావాలని కోరుకుంటున్నాను.”
“అలాగే డిఓపి గారు సినిమాలో ప్రతి ఫ్రేమ్ ని ఒక పెయింటింగ్ లా చూపించారు. అలాగే ఈ చిత్రం కోసం 5 సంవత్సరాలపాటు ఇంతగా కష్టపడిన చిత్ర బృందానికి, దేవిశ్రీ ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. శ్రీలీల చేసిన డాన్స్ తో నా హార్ట్ కిస్సిక్ అయిపోయింది. చివరిగా అల్లు అర్జున్ గారి గురించి చెప్పాలంటే మీతో కలిసి నటించడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. మీరు సరిహద్దులు దాటి వెళ్లేలా చేశారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా వైల్డ్ ఫైర్ కావలి అని ప్రార్థిస్తున్నాను. అలాగే అభిమానులకు ప్రేక్షకులకు ఎప్పుడు రుణపడి ఉంటాను” అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: