బ్రిలియంట్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తూ ప్రేక్షకులు ముందుకు రాబోతున్న చిత్రం పుష్ప 2. పుష్ప 1కు సీక్వెల్ గా ఈ చిత్రం రాబోతుంది. సుమారు పార్ట్ 1 వచ్చిన రెండు సంవత్సరాల తర్వాత ఈ చిత్రం రావడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల చేసిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది. రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ మరియు కిస్సిక్ సాంగ్ అయితే యూట్యూబ్‌లో సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్న ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ అందించింది. తాజాగా పుష్ప 2 సెన్సార్ పూర్తిచేసుకున్నట్టు సోషల్ మీడియా వేదికగా తెలిపింది. సెన్సార్ బోర్డు ఈ మూవీకి U/A సర్టిఫికేట్ అందించింది. ఇక టైటిల్ కార్డ్స్ మరియు సెన్సార్ యాడ్స్ అన్నీ కలుపుకొని 3గంటల 22నిమిషాల నిడివి కలిగి ఉంది.
ఇక ఈ చిత్రంలో సునీల్, ఫాహద్ ఫాజిల్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్, జగపతిబాబు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా, నేషనల్ అవార్డ్ విన్నర్ నవీన్ నూలి ఎడిటర్‌గా పనిచేయడం మరింత విశేషం. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సినిమాపై క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ప్రపంచవ్యాప్తంగా 12,000 స్క్రీన్ లలో రిలీజ్ చేస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: