రామ్ నెక్స్ట్ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్స్ ఖరారు

musical duo vivek mervin on board for rapo 22

డబుల్ ఇస్మార్ట్ తరువాత ఉస్తాద్ రామ్ పోతినేని చేయబోయే 22 వ సినిమా రీసెంట్ గానే గ్రాండ్ గా లాంచ్ అయ్యింది.ఈ చిత్రాన్ని మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్ మహేష్ బాబు పి డైరెక్ట్ చేయనుండగా రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే నటిస్తుంది.త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.ఇక ఈసినిమాకు మ్యూజిక్ డైరెక్టర్స్ ను ఎంపిక చేశారు. తమిళ సంగీత ద్వయం వివేక్ -మెర్విన్ లను ఈ సినిమా కోసం తీసుకున్నారు.తెలుగులో ఇదే వారికి మొదటి సినిమా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇంతకుముందు ఈ ద్వయం కోలీవుడ్ లో పలు చార్ట్ బాస్టర్ ఆల్బమ్స్ ఇచ్చారు.తొలి సినిమా వడా కర్రీతో మంచి పేరు తెచ్చుకున్నారు.ఆతరువాత వాళ్లిద్దరూ సంగీతం అందించిన ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బమ్ సాంగ్స్ ఓర్శాడా, పక్కం నీయుమ్ ఇళ్లై చార్ట్ బాస్టర్లుగా నిలిచాయి.ఇక ధనుష్ హీరోగా నటించిన పటాస్ అలాగే కార్తీ సుల్తాన్ సినిమాలకు వివేక్ – మెర్విన్ సూపర్ డూపర్ మ్యూజిక్ అందించారు.ఇప్పుడీ ఈ సంగీత ద్వయం తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నారు.మరి తెలుగులో ఎలాంటి మ్యూజిక్ క్రియేట్ చేస్తారో చూడాలి.మైత్రి మూవీ మేకర్స్ ఈసినిమాను నిర్మిస్తుండగా వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

ఇక రామ్ గత సినిమాలు నిరాశపరచడంతో ఈసారి రూట్ మార్చాడు.రొటీన్ యాక్షన్ ఎంటర్టైనర్ లు పక్కన పెట్టి తన 22 వ సినిమాకు సాలిడ్ కంటెంట్ వున్న స్టోరీని ఎంచుకున్నాడు.ఇందులో రామ్ సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు.త్వరలోనే ఈసినిమా గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.