ఉస్తాద్ రామ్ పోతినేని 22 వ సినిమా ఈరోజు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.ఈ చిత్రానికి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్ మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు.ఇందులో రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే నటిస్తుంది.త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో రామ్ పోతినేని,హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మీద చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు గోపీచంద్ మలినేని కెమెరా స్విచ్ఛాన్ చేయగా, దర్శకుడు హను రాఘవపూడి క్లాప్ ఇచ్చారు.తొలి సన్నివేశానికి దర్శకుడు వెంకీ కుడుముల గౌరవ దర్శకత్వం వహించారు. చిత్ర దర్శకుడు మహేష్ బాబుకు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలితో పాటు ఆ సంస్థ సీఈవో చెర్రీ, దర్శకులు గోపీచంద్ మలినేని, హను రాఘవపూడి, వెంకీ కుడుముల, శివ నిర్వాణ, పవన్ సాధినేని స్క్రిప్ట్ అందజేశారు.
ఇక రామ్ చివరి సినిమాలు అనుకున్నంతగా ఆడలేదు దాంతో ఈసారి రూట్ మార్చాడు.తన 22 వ సినిమాకు సాలిడ్ కంటెంట్ వున్న స్టోరీని ఎంచుకున్నాడు.ఇందులో రామ్ లుక్ కూడా మారనుంది.ఈసినిమాకు తమిళ మ్యూజిక్ డైరెక్టర్స్ వివేక్-మెర్విన్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేయాలనే ప్లాన్ లో వున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























