మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ ఈ దీపావళికి లక్కీ భాస్కర్ తో వచ్చి కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ ను అందుకున్నాడు.అంతేకాదు ఈసినిమాతో మొదటి సారి 100కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.ఇప్పటికీ ఈసినిమా డీసెంట్ వసూళ్లను రాబట్టుకుంటుంది.ఇక ఈసినిమా ఓటిటి లోకి కూడా రానుంది.నెట్ ఫ్లిక్స్ ఈనెల 28నుండి లక్కీ భాస్కర్ ను స్ట్రీమింగ్ లోకి తీసుకరానుంది.తెలుగు తోపాటు మలయాళ, కన్నడ ,తమిళ ,హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది.తెలుగులో తరువాత తమిళం లో ఈసినిమా సూపర్ వసూళ్లను దక్కించుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దుల్కర్ కు హీరోగా తెలుగులో ఇది రెండో సినిమా.మొదటి సినిమా సీతారామంతో బ్లాక్ బాస్టర్ కొట్టగా రెండో సినిమాతో అంతకుమించి విజయాన్ని అందుకున్నాడు.వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈసినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించగా జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు.నాగవంశీ, సాయి సౌజన్య ఈసినిమాను నిర్మించారు.
ఇక దుల్కర్ ప్రస్తుత్తం తెలుగులో ఆకాశంలో ఒక తార అనే సినిమా చేస్తున్నాడు.పవన్ సాధినేని డైరెక్ట్ చేస్తుండగా సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.దాంతో ఈసినిమా పై కూడా మంచి అంచనాలు వున్నాయి.గుణ్ణం సందీప్ -గుణ్ణం రమ్య ఈసినిమాను నిర్మిస్తున్నారు.వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో థియేటర్లలోకి రానుంది.ఈసినిమాతో పాటు దుల్కర్, కాంత అనే పాన్ ఇండియా సినిమా కూడా చేస్తున్నాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: