టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ గొప్ప మనసు చాటుకున్నారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఒక వ్యక్తికి వైద్య చికిత్సకు చేయూత అందించేందుకు ముందుకొచ్చారు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకోవాల్సిన పరిస్థితిలో ఒక పేషెంట్‌కి రూ.10 లక్షలు భారీ ఆర్ధిక సహాయం అందించారు. ఈ మేరకు తమన్ చేసిన గొప్ప పనిని మెచ్చుకుంటూ సదరు వ్యక్తికీ చికిత్స అందించిన వైద్యులు డాక్టర్ లీలా కృష్ణ గారు సోషల్ మీడియా వేదికగా ఒక పెట్టారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అందులో.. “AINU ఇండియా ఆస్పత్రిలో ఒక పేషెంట్‌కి కిడ్నీ మార్పిడి విజయవంతం అయ్యేలా సహాయం చేసినందుకు నా ప్రియమైన సోదరుడు సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్‌కు ధన్యవాదాలు. మీ గొప్ప మనసుకి, సహకారానికి జీవితాంతం కృతజ్ఞతలు” అని తెలిపారు. కాగా తమన్ సాయం గురించి తెలుసుకున్న నెటిజన్స్ ఆయన ఉదారస్వభావాన్ని ప్రశంసిస్తున్నారు.
కాగా తమన్ ప్రస్తుతం పలు చిత్రాలకు సంగీతం అందిస్తూ బిజీగా ఉన్నారు. ఆయన మ్యూజిక్ అందించిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఎస్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘గేమ్ ఛేంజర్’ చిత్రం జనవరి 10న విడుదలకానుంది. అలాగే జనవరి 12న రిలీజ్ కానున్న నందమూరి బాలకృష్ణ-బాబీ కాంబోలో రూపొందుతోన్న ‘డాకు మహారాజ్’ సినిమాకూ తమనే సంగీతం అందిస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: