గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా, బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మచ్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘డాకు మహారాజ్’. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో నేడు కార్తీక పూర్ణిమ శుభ సందర్భంగా చిత్ర టైటిల్‌ని ప్రకటించడంతో పాటు, టీజర్‌ను విడుదల చేశారు నిర్మాతలు. ఇక టీజర్ విడుదల కార్యక్రమంలో భాగంగా దర్శకుడు బాబీ కొల్లి మాట్లాడుతూ.. “టీజర్ మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. మీరు చూసిన టీజర్ లో డూపులు లేవు, డూప్లికేట్ లు లేవు. బాలకృష్ణ గారే అన్నీ నిజంగా చేశారు. గుర్రం ఎక్కింది ఆయనే, నడిపింది ఆయనే, యుద్ధానికి వచ్చేది కూడా ఆయనే. మీరు చూసినవన్నీ ఒరిజినల్ షాట్స్. తమన్ గారు అద్భుతమైన సంగీతం అందించారు.”
“నేనైనా, నాగవంశీ గారైనా దీనిని ఎప్పుడూ సాధారణ సినిమాలా చూడలేదు. బాలయ్య గారు సృష్టిస్తున్న రికార్డులను దృష్టిలో పెట్టుకొని, కేవలం మాస్ లోనే కాకుండా అన్ని వర్గాలలో ఆయనకు ఉన్న ఆదరణను దృష్టిలో పెట్టుకొని, ఎప్పుడూ చూడని కొత్త బాలకృష్ణ గారిని చూపించాలని, సినిమా మొదటి నుంచి ఎంతో శ్రద్ధతో పని చేస్తూ వచ్చాము.”
“టీజర్ లో మీరు చూసింది చాలా చాలా తక్కువ. సినిమా ఇంకా వేరే స్థాయిలో ఉంటుంది. దర్శకుడిని నమ్మి స్వేచ్ఛను ఇస్తారు బాలకృష్ణ. అందుకే ఇంత అద్భుతమైన అవుట్ పుట్ వచ్చింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు, నాకు సహకరించిన బృందం అందరికీ ధన్యవాదాలు. చివరగా ఒక్క మాట.. యుద్ధం గట్టిగా ఉండబోతుంది” అని అన్నారు.
ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ నటి ఊర్వశి రౌటేలా, శ్రద్దా శ్రీనాథ్ ఫీమేల్ లీడ్ రోల్స్ పోషిస్తుండగా.. ‘యానిమల్’ ఫేమ్ బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రముఖ ఛాయాగ్రాహకుడు విజయ్ కార్తీక్ కన్నన్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కళా దర్శకుడిగా అవినాష్ కొల్లా, ఎడిటర్ గా నిరంజన్ దేవరమానే వ్యవహరిస్తున్నారు. కాగా డాకు మహారాజ్ చిత్రం సంక్రాంతి కానుకగా 2025, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: