డాకు మహారాజ్ టీజర్‌పై ప్రశాంత్ వర్మ ఇంట్రెస్టింగ్ ట్వీట్

Director Prasanth Varma Interesting Comments on Daaku Maharaj Teaser

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా, బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో నేడు కార్తీక పూర్ణిమ శుభ సందర్భంగా చిత్ర టైటిల్‌ని ప్రకటించడంతో పాటు, టీజర్‌ను విడుదల చేశారు నిర్మాతలు. ఈ క్రమంలో ఈ టీజర్ పై ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ వర్మ కొన్ని ఇంట్రెసింగ్ కామెంట్స్ చేసారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా.. “టీజర్ అద్భుతంగా ఉంది!! డైరెక్టర్ బాబీ ఫెంటాస్టిక్ జాబ్. డాకు మహారాజ్‌గా నందమూరి బాలకృష్ణ గారిని చూపించిన విధానం సూపర్బ్” అని పేర్కొన్నారు.

ఇక ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటి ఊర్వశి రౌటేలా, శ్రద్దా శ్రీనాథ్‌ ఫీమేల్‌ లీడ్ రోల్స్‌ పోషిస్తుండగా.. ‘యానిమల్’ ఫేమ్ బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రముఖ ఛాయాగ్రాహకుడు విజయ్ కార్తీక్ కన్నన్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కళా దర్శకుడిగా అవినాష్ కొల్లా, ఎడిటర్ గా నిరంజన్ దేవరమానే వ్యవహరిస్తున్నారు. కాగా డాకు మహారాజ్ చిత్రం సంక్రాంతి కానుకగా 2025, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.