గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘NBK109’ (వర్కింగ్ టైటిల్). గత కొన్నేళ్లుగా అపజయమనేదే లేకుండా వరుస భారీ విజయాలతో దూసుకుపోతున్న ఆయన, తన 109వ చిత్రంగా దీనిని తీసుకొస్తున్నారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ ఊర్వశి రౌటేలా, శ్రద్దా శ్రీనాథ్ ఫీమేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్తీక పూర్ణిమ శుభ సందర్భంగా నేడు ఈ చిత్రం టైటిల్‌ను ప్రకటించింది చిత్ర యూనిట్. కాగా ఈ మూవీకి ‘డాకు మహారాజ్’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు మేకర్స్.
బాలయ్య ఇమేజ్‌కి తగ్గట్టుగా పవర్ ఫుల్‌గా ఉంది టైటిల్. కాగా బాలయ్య ఇందులో బందిపోటు పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తోంది. అందుకే దీనిని సూచించేలా ఈ టైటిల్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇక ఈ సందర్భంగా డాకు మహారాజ్ టీజర్ కూడా విడుదల చేసింది చిత్ర బృందం.
డాకు మహారాజ్ పాత్రను వివరిస్తూ టీజర్ ప్రారంభమవుతుంది. “ఈ కథ వెలుగును పంచే దేవుళ్లది కాదు.. చీకటిని పంచే రాక్షసులది కాదు.. ఆ రాక్షసులనే ఆడించే రావణుడిది కాడు. ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసే ఒక రాజుది.. గండ్రగొడ్డలి పట్టిన యమధర్మరాజుది. మరణాన్నే వణికించిన మహారాజుది.. డాకు డాకు మహారాజ్” అంటూ సాగిన టీజర్ గూస్‌బంప్స్ తెప్పిస్తోంది.
‘డాకు మహారాజ్’గా బాలకృష్ణను పరిచయం చేసిన తీరు అదిరిపోయింది. మునుపెన్నడూ చూడని సరికొత్త రూపంలో గుర్రంపై బాలకృష్ణ ఎంట్రీ ఇవ్వడం అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉంది. టీజర్ లోని ప్రతి ఫ్రేమ్ లో భారీతనం కనిపిస్తుంది. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. తమన్ నేపథ్య సంగీతం టీజర్ ని మరోస్థాయికి తీసుకెళ్లింది.
మొత్తానికి టీజర్ చూస్తుంటే, బాలకృష్ణతో కలిసి దర్శకుడు బాబీ థియేటర్లలో ప్రేక్షకులను సరికొత్త అనుభూతిని అందించే భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను అందించబోతున్నారని అర్థమవుతోంది.
బ్లాక్ బస్టర్ హిట్ ‘భగవంత్ కేసరి’ చిత్రం తర్వాత బాలయ్య నటిస్తోన్న చిత్రం కావడం.. అలాగే ‘వాల్తేర్ వీరయ్య’ వంటి సాలిడ్ హిట్ తర్వాత బాబీ దర్శకత్వంలో వస్తోన్న సినిమా కావడంతో డాకు మహారాజ్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తుండగా.. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది.
ప్రముఖ ఛాయాగ్రాహకుడు విజయ్ కార్తీక్ కన్నన్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కళా దర్శకుడిగా అవినాష్ కొల్లా, ఎడిటర్ గా నిరంజన్ దేవరమానే వ్యవహరిస్తున్నారు. కాగా డాకు మహారాజ్ చిత్రం సంక్రాంతి కానుకగా 2025, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























