రీసెంట్ గా రాయన్ తో వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టాడు తమిళ హీరో ధనుష్.ఈసినిమాలో నటించడమే కాదు దీనికి డైరెక్షన్ కూడా చేశాడు.ఇక ప్రస్తుతం ధనుష్ వరుస సినిమాలతో ఫుల్ బిజీ గా వున్నాడు. అందులో భాగంగా ఇడ్లీ కడాయి అనే సినిమా చేస్తున్నాడు.రూరల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది.ఇందులో ధనుష్ సరసన నిత్య మీనన్ నటిస్తుంది.ఇందులో నటించడమే కాదు డైరెక్షన్ కూడా చేస్తున్నాడు ధనుష్.ఇక ఈసినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు.వచ్చే ఏడాది ఏప్రిల్ 10న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమాతోపాటు ధనుష్ ప్రస్తుతం కుబేర కూడా చేస్తున్నాడు.తెలుగు ,తమిళంతో తెరక్కుతున్న ఈసినిమాలో నాగార్జున కీలక పాత్రలో నటిస్తుండగా రష్మిక మందన్న హీరోయిన్ గా చేస్తుంది.శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది.రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.వచ్చే ఏడాది ఫిబ్రవరి లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
వీటితోపాటు ధనుష్ ప్రస్తుతం నీక్ అనే సినిమా కూడా డైరెక్ట్ చేస్తున్నాడు.ఇక ఇవి కాకుండా ధనుష్ మరో మూడు సినిమాలకు కమిట్ అయ్యాడు.అందులో ఇళయరాజా బయోపిక్ ఒకటి. దీంతో పాటు హిందీలో ఓ సినిమా అలాగే అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి డైరెక్షన్ లో తన 55వ సినిమా చేయనున్నాడు.ఈసినిమా ఈరోజే లాంచ్ అయ్యింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: