మూడు ఓటిటిల్లోకి ఈరోజు మూడు భారీ సినిమాలు స్ట్రీమింగ్ లోకి వచ్చాయి.వీటిలో ఒకటి టాలీవుడ్ నుండి మరొకటి కోలీవుడ్ నుండి ఇంకోటి మలయాళం నుండి వచ్చాయి.ఇంతకీ ఆ సినిమాలు ఏంటంటే
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
టాలీవుడ్ నుండి ఈ ఏడాది మచ్ అవైటెడ్ సినిమా గా వచ్చింది ఎన్టీఆర్ దేవర.గత నెలలో థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా 400 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది.ఇక ఈ సినిమా ఇప్పుడు ఓటిటి లోకి వచ్చేసింది. నెట్ ఫ్లిక్స్ ఈరోజు నుండి స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.తెలుగు తోపాటు మిగితా దక్షిణాది భాషల్లో అందుబాటులోకి తీసుకురాగా రాగ త్వరలోనే హిందీలో కూడా విడుదలచేయనుంది.కొరటాల శివ ఈసినిమాను డైరెక్ట్ చేయగా అనిరుధ్ సంగీతం అందించాడు.యువ సుధ ఆర్ట్స్ ,ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మించాయి.దీనికి సెకండ్ పార్ట్ కూడా రానుంది.
ఇక కోలీవుడ్ నుండి సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన వేట్టయన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.దక్షిణాది భాషలతోపాటు హిందీలోకూడా ఈసినిమా అందుబాటులోకి వచ్చింది.గత నెల దసరా టైం లో థియేటర్లోకి వచ్చిన ఈసినిమా 250 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.టీజె జ్ఞానవేల్ డైరెక్ట్ చేయగా అమితాబ్ బచ్చన్ ,రానా ,ఫహాద్ ఫాజిల్,మంజు వారియర్ కీలక పాత్రల్లో నటించారు.అనిరుధ్ సంగీతం అందించగా లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది.
ఇక మలయాళం నుండి టోవినో థామస్ నటించిన ఏఆర్ఎమ్ అన్ని భాషల్లో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ లోకి వచ్చింది.సెప్టెంబర్ లో థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది.జితిన్ లాల్ ఈసినిమాను డైరెక్ట్ చేయగా కృతి శెట్టి,ఐశ్వర్య రాజేష్ ,సురభి లక్ష్మి హీరోయిన్లుగా నటించారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: