ప్రిన్స్ శివకార్తికేయన్, సాయి పల్లవి బ్రేవ్ హార్ట్ బ్లాక్ బస్టర్ ‘అమరన్’. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఉలగనాయగన్ కమల్ హాసన్, R. మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి నిర్మించారు. నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి, సిస్టర్ నిఖిత రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగులో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ ద్వారా గ్రాండ్ గా విడుదల చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి ఘన విజయాన్ని సాధించి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా టీం ‘అమరన్’ బ్రేవ్ హార్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ నిర్వహించింది. హీరో నితిన్ చీఫ్ గెస్ట్ గా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.
ఈ సందర్భంగా హీరో శివకార్తికేయన్ ఈ మూవీకి సంబంధించి తన అనుభవాలను పంచుకున్నారు. శివ కార్తికేయన్ ఏమన్నారో ఆయన మాటల్లోనే.. “అమరన్ మూవీని థియేటర్స్ లో చాలా గొప్పగా రిసీవ్ చేసుకుంటున్నారు. అందరికీ థాంక్యు. ఆంధ్ర, తెలంగాణలో చాలామంది సినిమా చూసి ఎమోషనల్ ఏడుస్తున్న వీడియోస్ చూశాను. మీ అందరికీ మూవీ ఈ రేంజ్ లో కనెక్ట్ అయినందుకు నేను చాలా హ్యాపీ.”
“మేజర్ వరదరాజన్ క్యారెక్టర్ చేయడానికి ముఖ్యమైన కారణం మా నాన్న. ఎందుకంటే ఆయన కూడా ఒక పోలీస్ ఆఫీసర్. ఆయనకి, ముకుంద్ క్యారెక్టర్‌కి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. ఈ మూవీ మా నాన్నకి ఒక ట్రిబ్యూట్. ఈ సినిమాని ఇంత స్పెషల్ గా మార్చిన ఆడియన్స్ అందరికీ థాంక్యూ. సినిమాకి ప్రపంచవ్యాప్తంగా చాలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. తెలుగులో చాలా మంచి కలెక్షన్స్ చేస్తుందని డైలీ కాల్స్ వస్తున్నాయి.”
“సినిమాని బిగ్ రిలీజ్ చేసిన సుధాకర్ గారికి థాంక్యూ. సునీల్ గారికి థాంక్యూ. ఆయన ఫోన్ 10 సెకండ్స్ మాత్రమే మాట్లాడుతారు. సినిమా చాలా అద్భుతంగా కలెక్షన్ చేస్తుంది. సక్సెస్ మీట్ లో కలుద్దామని చెప్పి థాంక్స్ చెప్పేలోగే ఫోన్ పెట్టేస్తారు (నవ్వుతూ). డైరెక్టర్ రాజ్ కుమార్‌కి థాంక్యూ. టీవీ డేస్ నుంచి మాకు పరిచయం ఉంది. తను బ్రిలియంట్ రైటర్ డైరెక్టర్. ఈ సినిమాకి ఏ అవార్డు వచ్చినా అది ఫస్ట్ రాజ్ కుమార్‌కి దక్కాలి.”
“సాయి పల్లవితో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మేం కలిసి చేసిన ఫస్ట్ సినిమా చాలా పెద్ద సక్సెస్ కావడం ఆనందాన్నిచ్చింది. ఇందు, ముకుంద క్యారెక్టర్స్‌కి ఆడియన్స్ చాలా గొప్పగా కనెక్ట్ అవుతున్నారు. మా టీంలో అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. తెలుగు ఆడియన్స్ అందరికీ థాంక్యూ సో మచ్. తెలుగు ఆడియన్స్ ఎప్పుడు మంచి కంటెంటే చూస్తారు. అది అమరన్ మరోసారి ప్రూవ్ అయింది. సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసిన అందరికీ థాంక్యూ.”
“నితిన్ బ్రదర్ ఈవెంట్‌కి రావడం చాలా ఆనందంగా ఉంది. నితిన్ గారి సినిమా ఇష్క్‌లో ‘ఓ ప్రియా ప్రియ’ సాంగ్ నాకు చాలా ఇష్టం. చాలా చార్మింగ్‌గా ఉంటారు. ‘డాక్టర్’ సినిమా చూసి ఆయన నాకు కాల్ చేశారు. మేము ఎప్పుడు ఫోన్ లోనే మాట్లాడుకునేవాళ్ళం. ఇప్పుడు నేరుగా అమరన్ సక్సెస్ మీట్‌లో కలవడం చాలా ఆనందంగా ఉంది. రాబిన్ హుడ్ బెస్ట్ విషెస్. రాబిన్ హుడ్ బ్లాక్ బస్టర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు హీరో శివకార్తికేయన్.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: