దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ నిన్నటి తో మొదటి వారం రన్ పూర్తి చేసుకుంది.ఇక ఈ ఫస్ట్ వీక్ లో స్ట్రాంగ్ హోల్డ్ కొనసాగిస్తూ ప్రపంచ వ్యాప్తంగా 71.2కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.ఇప్పటికే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి మంచి లాభాలను తీసుకొస్తుంది.తమిళనాడులో ఈ సినిమాకు థియేటర్లను కూడా పెంచారు.ఈరోజు నుండి దాదాపు 1000కి పైగా స్క్రీన్ లలో ప్రదర్శించబడుతుంది.తెలుగు రాష్ట్రాల్లో మిగితా సినిమాలతో పోటీ వున్నా సాలిడ్ వసూళ్లను సొంతం చేసుకుంటుంది.అటు నార్త్ అమెరికాలో 900k డాలర్లను రాబట్టింది.ఈరోజుతో 1 మిలియన్ మార్క్ ను చేరుకోనుంది.ఓవరాల్ గా ఈసినిమా సూపర్ హిట్ నుండి బ్లాక్ బాస్టర్ దిశగా దూసుకుపోతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఫుల్ రన్ లో లక్కీ భాస్కర్ 100కోట్ల క్లబ్ లో చేరనుంది.దుల్కర్ కు ఇదే మొదటి 100 కోట్ల సినిమా కానుంది.తెలుగులో హీరోగా చేసిన రెండో సినిమాతో ఈ ఫీట్ సాధించనున్నాడు దుల్కర్.వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈసినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించగా జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. నాగవంశీ, సాయి సౌజన్య ఈసినిమాను నిర్మించారు.
ఓటిటి విషయానికి వస్తే ఈసినిమా స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.ఈసినిమాతో వెంకీ అట్లూరి వరుసగా రెండో బ్లాక్ బాస్టర్ ను ఖాతాలో వేసుకున్నాడు.గత ఏడాది తన డైరెక్షన్ లో వచ్చిన సార్ కూడా బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది.తమిళ్,తెలుగులోకి కలిపి 100 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.ఇక వెంకీ అట్లూరి నెక్స్ట్ మూవీ ని కూడా సితార ఎంటర్టైన్మెంట్స్ లోనే చేయనున్నాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: