ప్రిన్స్ శివకార్తికేయన్, సాయి పల్లవి బ్రేవ్ హార్ట్ బ్లాక్ బస్టర్ ‘అమరన్’. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఉలగనాయగన్ కమల్ హాసన్, R. మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి నిర్మించారు. నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి, సిస్టర్ నిఖిత రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగులో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ ద్వారా గ్రాండ్ గా విడుదల చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి ఘన విజయాన్ని సాధించి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా టీం ‘అమరన్’ బ్రేవ్ హార్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ నిర్వహించింది. హీరో నితిన్ చీఫ్ గెస్ట్ గా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.
ఈ సందర్భంగా మూవీ డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరియసామి మాట్లాడుతూ.. “సౌత్ లో ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో వచ్చే సినిమాల్ని ప్రేక్షకులు అంతగా ఆదరించరనే ఒక థియరీ వుంది. ఆ థియరీని అమరన్ బ్రేక్ చేసింది. ఈ సినిమాని తెలుగులో ఇంత గొప్పగా ఆదరించిన ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మంచి కంటెంట్ ని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని మరోసారి రుజువయింది.” అని పేర్కొన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “ఈ సినిమాని తెలుగులో చాలా అద్భుతంగా డబ్ చేసిన హనుమాన్ చౌదరి అండ్ టీమ్ అందరికీ థాంక్స్. ఈ సినిమాని పలు భాషల్లో సొంతగా సాయి పల్లవి డబ్బింగ్ చెప్పారు. ఈ సినిమాకి మలయాళీ యాసలో డబ్ చెప్పడం కూడా ఒక పెద్ద టాస్క్. సాయి పల్లవి గారు అద్భుమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. శివ కార్తికేయన్ గారు మేజర్ వరదరాజన్ పాత్రలో అందరినీ మైమరిపించారు. ఈ సినిమాని తెలుగులో ఇంత గొప్పగా రిలీజ్ చేసిన సుధాకర్ గారికి ధన్యవాదాలు. నితిన్ గారికి, ఏషియన్ సునీల్ గారికి, ఠాగూర్ మధు గారికి అందరికీ ధన్యవాదాలు” అని తెలిపారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: