భారతీయ ప్రముఖ ఇతిహాసం రామాయణం ఆధారంగా తెరకెక్కుతోన్న బాలీవుడ్ మోస్ట్ ప్రెస్ట్రీజియస్ ప్రాజెక్ట్ ‘రామాయణ’. స్టార్ హీరో రణబీర్ కపూర్ రాముడిగా పురాణపురుషుడి పాత్రలో నటిస్తుండగా.. ప్రముఖ దక్షిణాది నటి సాయి పల్లవి సీతమ్మగా కనిపించనున్నారు. ఇక మరో కీలక పాత్ర రావణాసురుడిగా శాండల్‌వుడ్ స్టార్, ‘కేజీఎఫ్’ ఫేమ్ యష్ నటించనున్నట్టు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలావుంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఈ చిత్రం విడుదల తేదీకి సంబంధించి బిగ్ అనౌన్స్‌మెంట్‌ను ఇచ్చారు మేకర్స్. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించి ఒక పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్లో నిప్పులు చెరుగుతూ నింగి వైపు దూసుకుపోతున్న రామబాణం కనిపిస్తోంది.
ఇక మేకర్స్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందుతోంది. ఫస్ట్ పార్ట్‌ను దీపావళి కానుకగా 2026లో విడుదల చేయనున్నారు. అలాగే రెండో పార్టును 2027లో దీపావళి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ మేరకు అధికారికంగా చిత్రబృందం ప్రకటించింది.
కాగా ఈ రామాయణం సినిమాకు ‘దంగల్’ ఫేమ్ నితేష్ తివారీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ సంబంధించి ప్రీ ప్రోడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఇక ఈ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ స్టార్ నటుడు సన్నీ డియోల్ హనుమంతుడిగా, రకుల్ ప్రీత్ సింగ్ శూర్పణఖగా, లారా దత్తా కైకేయిగా నటిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సివుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























