టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తన అప్‌కమింగ్ మూవీ ‘మెకానిక్ రాకీ’తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమౌతున్నాడు. #VS10 ప్రాజెక్టుగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి వహించడంతోపాటు రచన కూడా చేస్తున్నాడు. ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీని మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ చిత్రంలో ‘గుంటూరు కారం’ ఫేమ్ మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్లో కనిపించనుండగా.. మరో స్టార్ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ కూడా నటిస్తోంది. అలాగే సీనియర్ నటుడు నరేష్, వైవా హర్ష, హర్షవర్ధన్, రోడీస్ రఘు రామ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గేర్, ఫస్ట్ లుక్ పోస్టర్స్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇంకా ఫస్ట్ సింగిల్ ‘గుల్లెడు గుల్లెడు’, సెకండ్ సింగిల్ ‘ఓ పిల్లో’ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ పాటల్లో విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి లవ్లీ కెమిస్ట్రీ ఆకట్టునేలా వుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి మరో లిరికల్ వీడియో విడుదలచేశారు మేకర్స్. ‘ఐ హేట్ యూ మై డాడీ’ అంటూ సాగే పాటను మెకానిక్ రాకీ టీమ్ రిలీజ్ చేసింది.
ఇక ఈ పాటకు జేక్స్ బెజోయ్ స్వరాలు అందించగా.. సనారే సాహిత్యం, అలాగే గాయకుడు రామ్ మిరియాల గాత్రం అందించారు. జేక్స్ బిజోయ్ ఈ సాంగ్‌ని థపింగ్ బీట్స్‌తో క్యాచి నెంబర్‌గా కంపోజర్ చేశారు. ఫాదర్ అండ్ సన్ బాండింగ్‌ని హ్యుమరస్ అండ్ ఎంటర్ టైనింగ్‌గా ప్రజెంట్ చేసిన ఈ సాంగ్‌ని స్టార్ సింగర్ రామ్ మిరియాల తన మెస్మరైజింగ్ వాయిస్‌తో ఎనర్జిటిక్‌గా పాడారు.
సనారే రాసిన లిరిక్స్ ఆకట్టుకున్నాయి. ఇక ఈ సాంగ్‌లో ఫాదర్ అండ్ సన్‌గా నరేష్, విశ్వక్ సేన్ బాండింగ్ అందరికీ కనెక్ట్ అయ్యేలా వుంది. విశ్వక్ డ్యాన్స్ మూమెంట్స్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాయి. క్యాచి ట్యూన్, లిరిక్స్, ఎనర్జిటిక్ వోకల్స్, సూపర్బ్ పెర్ఫార్మెన్స్‌లతో ఈ సాంగ్ ఇన్స్టెంట్ చార్ట్ బస్టర్‌గా నిలిచింది.
హైబడ్జెట్‌తో భారీ కాన్వాస్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పనిచేస్తున్నారు. ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. మనోజ్ కటసాని డీవోపీ, అన్వర్ అలీ ఎడిటర్, క్రాంతి ప్రియం ప్రొడక్షన్ డిజైనర్. సత్యం రాజేష్, విద్యాసాగర్ జె ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరిస్తున్నారు.
కాగా మెకానిక్ రాకీ దీపావళి రేసులో ఉంటుందని ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేసిన నేపథ్యంలో ఈ మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్ నవంబర్ 22న విడుదల కానుంది. ఇక మెకానిక్ రాకీ ఆలిండియా డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ను ప్రముఖ సంస్థ దక్కించుకున్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్, ఏషియన్ సినిమాస్ సంయుక్తంగా ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























