యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా, చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’ విడుదలకు సిద్ధమవుతోంది. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ మూవీ రిలీజ్ డేట్‌ని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. వచ్చే ఏడాది వాలెంటైన్స్ డేకి కొన్నిరోజుల ముందు ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు తెలియజేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా హీరోయిన్ సాయి పల్లవి మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. ఈ వేడుకుని చూస్తుంటే ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లా అనిపిస్తుంది. ఈ సినిమా చేసినప్పుడు కంటే ఇప్పుడు చాలా పెద్ద కాన్వాస్ అయింది. గీత ఆర్ట్స్ అల్లు అరవింద్ గారు, బన్నీ వాస్ గారు నాకు ఎలాంటి అవార్డు వచ్చినా, నా సినిమా విజయమైనా ఎంతగానో గౌరవించి, సన్మానిస్తారు. ఒక కూతురులా చూసుకుంటారు. దానికి నేను థాంక్యూ తప్ప ఇంకేం చెప్పలేను” అని పేర్కొన్నారు.
ఇంకా ఆమె మాట్లాడుతూ.. “తండేల్ కోసం హీరో నాగ చైతన్య చూపిన కమిట్‌మెంట్ అద్భుతం. ఇన్ని సంవత్సరాలు పాటు ఒకే సినిమా గురించి ఆలోచించడం, డెడికేషన్‌తో పనిచేయడం అంటే మాటలు కాదు, ఇప్పటివరకూ నేను ఇలాంటి హీరోను చూడలేదు. అందుకే తనకోసమైనా ఈ చిత్రం బిగ్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. అందరం చాలా ఎఫర్ట్ పెట్టి సినిమా చేశాం. ఈ సినిమా అందరికీ నచ్చాలని కోరుకుంటాను. అందరికీ థాంక్యూ సో మచ్’ అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: