సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తన సెకండ్ మూవీ ‘దేవకి నందన వాసుదేవ’ లో మాస్, యాక్షన్-ప్యాక్డ్ పాత్రలో కనిపించనున్నారు. గుణ 369తో ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దేవకి నందన వాసుదేవ మూవీ నవంబర్ 14న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచుతున్నారు. దీనిలో భాగంగా ఈ సినిమా నుంచి ఇప్పటికే మూడు పాటలు రిలీజ్ చేయగా, అవి సూపర్ హిట్ అయ్యాయి. ఇదేక్రమంలో తాజాగా మేకర్స్ ‘బంగారం’ సాంగ్ ని రిలీజ్ చేశారు.
సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో ఈ సాంగ్ ని మాస్ డ్యాన్స్ నెంబర్ గా కంపోజ్ చేశారు. భోలే షావలి లిరిక్స్ మాస్ ని ఆకట్టుకునేలా వున్నాయి. సింహా, ఉమా నేహా ఎనర్జిటిక్ వోకల్స్ తో మెస్మరైజ్ చేశారు. ఈ సాంగ్ లో అశోక్ గల్లా ఎనర్జిటిక్ డ్యాన్స్ మూమెంట్స్ తో అదరగొట్టారు. అశోక్ గల్లా, వారణాసి మానస కెమిస్ట్రీ సూపర్బ్ గా వుంది.
వైబ్రెంట్ సెట్స్‌లో షూట్ చేసిన ఈ సాంగ్‌లో విజువల్స్ చాలా గ్రాండ్‌గా వున్నాయి. డివైన్ ఎలిమెంట్స్‌తో కూడిన ఈ యాక్షన్ ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కి ‘హనుమాన్’ ఫేమ్ క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కథ అందించడం విశేషం. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాయగా.. ప్రసాద్ మూరెళ్ల, రసూల్ ఎల్లోర్ సంయుక్తంగా సినిమాటోగ్రఫీ అందించారు. అలాగే తమ్మిరాజు ఎడిటింగ్ నిర్వహిస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























