యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా, చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’ విడుదలకు సిద్ధమవుతోంది. అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మకమైన గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ మూవీ రిలీజ్ డేట్‌ని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
వచ్చే ఏడాది వాలెంటైన్స్ డేకి కొన్నిరోజుల ముందు ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు తెలియజేశారు. రిలీజ్ డేట్ పోస్టర్‌లో లీడ్ పెయిర్ నాగ చైతన్య మరియు, సాయి పల్లవి మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది. ఇది అందమైన సముద్ర నేపథ్యంలో సెట్ చేయబడింది. ఈ పోస్టర్ వారి పాత్రలు మధ్య డీప్ లవ్‌ని సూచిస్తుంది.
బ్లాక్‌బస్టర్ హిట్ ‘లవ్ స్టోరీ’ తర్వాత నాగ చైతన్య, సాయి పల్లవి జోడిని మరోసారి తెరపై చూడటానికి అభిమానులు ఎంతగానో ఎదురుచుస్తున్నారు. లవ్, యాక్షన్, డ్రామా, అడ్రినలిన్ రష్ మూమెంట్స్ బ్లెండ్‌తో ఈ సినిమా అద్భుతంగా వుండబోతోంది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు.
ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ.. “100% లవ్ సినిమాతో వాసు తో నా జర్నీ స్టార్ట్ అయింది. ఆయనతో మళ్ళీ ఒక సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. గీతా ఆర్ట్స్‌లో ఈ స్టోరీ లైన్ గురించి వినగానే నాకు చేయాలని అనిపించింది. చాలా పెద్ద కాన్వాస్ సినిమా ఇది. ఈ పాత్ర గురించి తెలుసుకోవాలని శ్రీకాకుళం వెళ్లి మత్స్యకారులతో గడిపాం. నన్ను తెరపై నెక్స్ట్ లెవల్ లో చూపించాలని డైరెక్టర్ చందూ చాలా కష్టపడ్డారు” అని తెలిపారు.
ఇక నటి సాయి పల్లవి గురించి చైతూ మాట్లాడుతూ.. “సాయి పల్లవి క్వీన్ ఆఫ్ బాక్సాఫీస్. తన పాత్ర గురించే కాదు, అన్ని పాత్రల గురించి ఆలోచిస్తూ చాలా సపోర్ట్ చేస్తుంది. ఇక సాయి పల్లవి డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పడానికేం లేదు. ఎంత అద్భుతమైన డాన్సరో అందరికీ తెలిసిందే. తనతో డాన్స్ చేయాలంటే నాకు చిన్న భయం” అని నవ్వులు పూయించారు చైతూ.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: