సౌత్ స్టార్ హీరో సూర్య నటించిన కంగువాకు బజ్ రోజురోజుకి పెరిగిపోతుంది.ముఖ్యంగా సాంగ్స్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటున్నాయి. దాంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. నిన్న రిలీజ్ చేసిన కంగువా యాంతం కూడా సూపర్ అనే రివ్యూస్ తెచ్చుకుంటుంది.ఈ పాటకు రాక్ స్టార్ దేవి ప్రసాద్ అదిరిపోయే ట్యూన్స్ ఇచ్చాడు.ఇక ఈ సినిమా సెన్సార్ కూడా కంప్లీట్ అయ్యింది.సెన్సార్ బోర్డు ఒక్క కట్ కూడా చెప్పకుండా యు /ఏ సరిఫికేట్ ఇవ్వడంతో 2గంటల 34నిమిషాల రన్ టైంతో థియేటర్లలోకి రానుంది.అలాగే సెన్సార్ సభ్యులు సినిమాకు పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చారట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ప్రస్తుతం కంగువా ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా వుంది టీం.ఈసినిమా నుండి ఆల్రెడీ ఒక ట్రైలర్ రిలీజ్ కాగా త్వరలోనే రెండో ట్రైలర్ కూడా రానుంది. శివ తెరకెక్కించిన ఈసినిమాలో సూర్య డ్యూయెల్ రోల్ లో కనిపించనున్నాడు.అందులో ఒక రోల్ కంగువా కాగా మరొకటి ఫ్రాన్సిస్.దిశా పటాని ,బాబీ డియోల్ ,యోగిబాబు ,రెడిన్ కింగ్స్ లే కీలక పాత్రల్లో నటించారు.స్టూడియో గ్రీన్,యూవీ క్రియేషన్స్ ఈసినిమాను నిర్మించాయి.నవంబర్ 14న కంగువా భారీ స్థాయిలో విడుదలకానుంది.హిట్ టాక్ వస్తే మొదటి రోజు 100కోట్ల క్లబ్ లో చేరిన ఆశ్చర్య పోనక్కర్లేదు.
ఇక ఈసినిమా రిలీజ్ తరువాత సూర్య తన 45వ సినిమాను మొదలుపెట్టనున్నాడు.ప్రముఖ నటుడు ఆర్ జె బాలాజీ ఈసినిమాను డైరెక్ట్ చేయనున్నాడు.డ్రీం వారియర్ పిక్చర్స్ నిర్మించనుండగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























