మాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల దసరా బ్లాక్ బస్టర్ ‘విశ్వం’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్‌పై నిర్మాత టిజి విశ్వప్రసాద్ హైబడ్జెట్‌తో నిర్మించారు. దోనేపూడి చక్రపాణి ఈ చిత్రాన్ని సమర్పించారు. దసరా కానుకగా అక్టోబర్ 11న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజైన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తూ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్‌తో ఘన విజయాన్ని సాధించి, సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ విశ్వం దసరా బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ నిర్వహించారు. సినిమా యూనిట్ అంతా పాల్గొన్న ఈ సక్సెస్ మీట్ చాలా గ్రాండ్‌గా జరిగింది.
ఈ సందర్భంగా హీరో గోపీచంద్ ఏమన్నారో ఆయన మాటల్లోనే చూద్దాం.. “అందరికీ నమస్కారం. విశ్వం సినిమా అక్టోబర్ 11న రిలీజ్ అయినప్పుడు నుంచి ఈ సినిమాని ఇంత గొప్పగా ఆదరించిన తెలుగు ప్రేక్షకులు అందరికీ పేరుపేరునా థాంక్యూ సో మచ్. ఇంత మంచి సక్సెస్ ఇచ్చినందుకు మీ అందరికీ ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఇంత బాగా సపోర్ట్ చేసిన మీడియాకి పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమా విషయంలో డైరెక్టర్ గారిని బ్లైండ్‌గా నమ్మేశాను. చాలా మంచి రిజల్ట్ ఇచ్చారు. థాంక్యూ సో మచ్ సార్.”
“నరేష్ గారు, పృద్వీ గారు.. ఇలా ఈ సినిమాలో పనిచేసిన ప్రతి యాక్టర్‌ని చాలా ఇబ్బంది పెట్టాను (నవ్వుతూ). వాళ్లంతా ఒకటే టేక్‌లో ఫినిష్ చేసి వెళ్లేవారు. నావల్ల పది టేకులు చేయాల్సి వచ్చింది. వాళ్ళు యాక్ట్ చేసేటప్పుడు నవ్వుతూనే ఉన్నాను. ఆ రోజు నేను ఏదైతే ఫీలయ్యానో సేమ్ అదే థియేటర్లో ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు. ప్రతి సీన్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. థియేటర్స్‌లో ఆడియన్స్ నవ్వులు చూస్తుంటే చాలా హ్యాపీగా వుంది. కామెడీ, యాక్షన్, ఎమోషన్ అన్ని సీన్స్‌ని చాలా ఎంజాయ్ చేస్తున్నారు.”
“ఇందులో చిన్న పాప చాలా అద్భుతంగా నటించింది. ఆ పాప సెంటిమెంట్ కూడా చాలా బాగా వర్క్ అవుట్ అయింది. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్ చాలా హార్డ్ వర్క్ చేశారు. తెరవెనక చాలా కష్టపడ్డారు. ఈ సినిమాలో పని చేసిన నటీనటులు, టెక్నీషియన్స్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. వర్డ్ ఆఫ్ మౌత్ అని వింటా ఉన్నాను. కానీ ఈ సినిమాకి చూశాను. ప్రేక్షకులు వోన్ చేసుకుంటే సినిమాని ఎంత దూరమైనా తీసుకెళ్తారని ఈ సినిమాతో నిరూపించారు. అందరికీ థాంక్యూ సో మచ్’ అని అన్నారు హీరో గోపీచంద్.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: