’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే సినిమాతో వెండితెరపై అరంగేట్రం చేసిన ప్రముఖ యాంకర్ కమ్ హీరో ప్రదీప్ మాచిరాజు తన రెండవ సినిమాను ప్రారంభించాడు. దర్శక ద్వయం నితిన్ మరియు భరత్ ఆధ్వర్యంలో తెరకెక్కిస్తున్న ఈ మూవీ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోంది. మాంక్స్ అండ్ మంకీస్ బ్యానర్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో మరో ప్రముఖ లేడీ యాంకర్ దీపికా పిల్లి కథానాయికగా నటిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ఈ సినిమా టైటిల్‌ను వెల్లడించారు. ఈ చిత్రానికి ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ అనే పేరుని ఖరారు చేశారు. అయితే ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటి సినిమా టైటిల్ కూడా కావడం విశేషం. ఇక టైటిల్ ఎనౌన్స్మెంట్తో పాటు మూవీ ఫస్ట్ లుక్ మరియు మోషన్ వీడియోను కూడా ఆవిష్కరించారు.
ఈ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ గమనిస్తే.. ప్రదీప్ పచ్చని నేపథ్యంలో దీపిక కళ్లలోకి చూస్తూ వారి ఆనందకరమైన కెమిస్ట్రీని ప్రదర్శిస్తున్నారు. ఒక గ్రామంలో తీవ్ర గందరగోళం మధ్య ప్రదీప్ ఇంటి నుండి దీపిక ఇంటికి ఫైర్‌ఫ్లై ప్రయాణించే అందమైన దృశ్యాన్ని వర్ణిస్తుంది, ఇది ఒక ఆహ్లాదకరమైన ప్రేమకథను సూచిస్తుంది.
ప్లాట్లైన్కి వస్తే- ఒక సివిల్ ఇంజనీర్ పని కోసం ఒక గ్రామంలోకి ప్రవేశించి, ఉత్సాహవంతులైన పల్లెటూరి అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వినోదభరితమైన ప్రేమకథ, అద్భుతమైన క్షణాలు, ఊహించని మలుపులు మరియు ఆశ్చర్యకరమైన ప్రేమ కథ.. ఇలా ప్రతి అంశం ప్రేక్షకులకు మధురానుభూతి పంచనుంది.
కాగా ఈ చిత్రంలో ప్రముఖ హాస్యనటులు వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీను, మురళీధర్ గౌడ్, జి ఎం సుందర్, జాన్ విజయ్, రోహిణి, ఝాన్సీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు మోషన్ వీడియో రెండూ సినిమాపై మంచి ఉత్సుకతను రేకెత్తించాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్లను రెగ్యులర్‌గా అందిస్తామని మేకర్స్ హామీ ఇచ్చారు.
ఇక ఈ చిత్రం కోసం యంగ్ అండ్ ట్యాలెంటెడ్ టెక్నిషియన్ల టీమ్ పనిచేయనుంది. ప్రదీప్ మొదటి సినిమా మ్యూజికల్ హిట్ కావడంతో మేకర్స్ ఈ మూవీలో కూడా సంగీతానికి ప్రాధాన్యతనిస్తున్నారు. దీనిలో భాగంగా, అద్భుతమైన సౌండ్‌ట్రాక్‌లను అందించడానికి స్వరకర్త రధన్‌ను ఎంచుకున్నారు. ఎంఎన్ బాలరెడ్డి కెమెరా క్రాంక్ చేయగా, కోదాటి పవనకల్యాణ్ ఎడిటింగ్ నిర్వహిస్తున్నారు. సందీప్ బొల్లా కథ మరియు సంభాషణలు అందించగా, అశిష్టేజ పులాల ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























