ఈ సినిమాతో వర్డ్ ఆఫ్ మౌత్ పవర్ ఏంటో తెలుసుకున్నా

Director Sreenu Vaitla Thanks Audience For Huge Success of Viswam

మాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల దసరా బ్లాక్ బస్టర్ ‘విశ్వం’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్‌పై నిర్మాత టిజి విశ్వప్రసాద్ హైబడ్జెట్‌తో నిర్మించారు. దోనేపూడి చక్రపాణి ఈ చిత్రాన్ని సమర్పించారు. దసరా కానుకగా అక్టోబర్ 11న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజైన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తూ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్‌తో ఘన విజయాన్ని సాధించి, సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ విశ్వం దసరా బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ నిర్వహించారు. సినిమా యూనిట్ అంతా పాల్గొన్న ఈ సక్సెస్ మీట్ చాలా గ్రాండ్‌గా జరిగింది.

ఈ సందర్భంగా డైరెక్టర్ శ్రీను వైట్ల సినిమాని బాగా సపోర్ట్ చేసిన మీడియాకి, ఆదరించిన ప్రేక్షకులకు థాంక్స్ చెప్పారు. శ్రీను వైట్ల ఏమన్నారో ఆయన మాటల్లోనే తెలుసుందాం.. “ఈ సినిమాతో వర్డ్ ఆఫ్ మౌత్ పవర్ ఏంటో తెలుసుకున్నాను. ఎందుకంటే ఈ సినిమా త్రీ టైమ్స్ హైయర్ రెవెన్యూ సెకండ్ డే చేసింది. వీక్ డేస్‌లో కూడా అదే కంటిన్యూ అవుతుంది. దీనంతటికి కారణం వర్డ్ అఫ్ మౌత్. ప్రేక్షకులకి థాంక్యూ సో మచ్. ఇది నేను ఎప్పటికీ మర్చిపోలేను.”

“నా బలం కామెడీ అని అందరూ చెప్తారు. అది బిగ్ టైం వర్కౌట్ అయి ఇంత పెద్ద హిట్ కావడానికి ఒక ప్రధాన కారణం కావడం సంతోషంగా ఉంది. ఇందులో పాప సెంటిమెంట్, మదర్ సాంగ్ ఫేవరెట్ అని ముందు నుంచి చెబుతున్నాను. ఈ సినిమా ఆడియన్స్‌కి నచ్చడానికి మదర్ ఎమోషన్, పాప ట్రాక్ చాలా పెద్ద రీజన్ అయింది. సినిమాలో యాక్షన్ బావుంది.. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ సినిమా ఈరోజు ఎంత పెద్ద హిట్ అయిందని అనుకుంటున్నాను.”

గోపి నాకు చాలా సపోర్ట్‌గా నిలబడ్డాడు. నిజానికి ఇందులో మదర్ సాంగ్ పెట్టడానికి హీరో యాక్సెప్టెన్సీ కావాలి. తను చాలా మంచి మనసుతో ఆ సాంగ్ పెట్టడానికి ఒప్పుకున్నాడు. ప్రతి విషయంలో నేను ఏదనుకుంటే అది చేయడానికి ఫ్రీడమ్ ఇచ్చిన గోపికి మనస్ఫూర్తిగా థాంక్స్. నరేష్ గారు గొప్ప ఎనర్జీతో క్యారెక్టర్ చేశారు. అలాగే వెన్నెల కిషోర్, ప్రగతి గారు, పృథ్వి గారు, సునీల్.. ఇలా చాలామంది ఆర్టిస్టులు అద్భుతంగా చేశారు.”

“చేతన్ భరద్వాజ్ ఫెంటాస్టిక్ మ్యూజిక్ ఇచ్చాడు. ఎడిటర్ అమర్ ప్రాణం పెట్టి పని చేశాడు. నా రైటర్స్ టీం గోపి మోహన్, ప్రవీణ్, భాను నందు ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని నాతోపాటు కష్టపడి పనిచేశారు. ఫైనల్‌గా వర్డ్ ఆఫ్ మౌత్ అనేది ఏంటో ఈ సినిమాతో చూశాను. ఇంకా చూడని ప్రేక్షకులు సినిమా చూడాలి. 100% థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమా ఇది. థియేటర్స్‌లో ఫ్యామిలీతో చూస్తేనే ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసిన వేణు దోనేపూడి గారు, విశ్వ ప్రసాద్ గారికి మరోసారి థాంక్స్ చెప్తున్నాను” అని అన్నారు దర్శకుడు శ్రీను వైట్ల.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.