కోలీవుడ్ సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘వేట్టయన్-ది హంటర్’. ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేళ్ దర్శకత్వం వహిస్తున్నాడు. దుషారా విజయన్, రితికా సింగ్ ఫీమేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్, మాలీవుడ్ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్, ప్రముఖ మలయాళ నటి మంజు వారియర్, రానా దగ్గుబాటి, రావు రమేశ్, రోహిణి మొల్లేటి కీలక పాత్రలు పోషిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే ఈ మూవీ నుంచి లాంచ్ చేసిన టైటిల్ టీజర్ సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేసింది. ఇక ఇటీవలే ఈ మూవీ నుండి ఫస్ట్ సింగిల్ ‘మనసిలాయో’, ‘హంటర్ వంటార్’ అనే సెకండ్ సింగిల్, వేట్టయన్ తెలుగు ప్రివ్యూ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవలే వేట్టయన్ మూవీ సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ అందించింది.
కాగా లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ సుభాస్కరన్ నిర్మిస్తున్న వేట్టయన్ మూవీ దసరా కానుకగా అక్టోబరు 10న తమిళం, తెలుగు, హిందీ & కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ‘వేట్టయన్- ద హంటర్’ తెలుగు ట్రైలర్‌ని గాంధీ జయంతి సందర్భంగా ఆదివారం విడుదల చేశారు మేకర్స్. ఇక ఈ ట్రైలర్ గమనిస్తే.. సినిమాలో రజినీకాంత్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్టుగా పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించనున్నట్టు తెలుస్తోంది.
ట్రైలర్ ఆద్యంతం ఫుల్ యాక్షన్ సన్నివేశాలతో సాగింది. ముఖ్యంగా సూపర్ స్టార్ చెప్పిన డైలాగ్స్ అదిరిపోయాయి. ‘క్రైమ్ క్యాన్సర్‌లాంటిది. దానిని పెరగనివ్వకూడదు’ ‘నన్ను ఏ పోస్టులో తిప్పి కొట్టినా నేను మాత్రం పోలీస్ వాడినే సార్. నా నుంచి వాడిని కాపాడటం ఎవరి వల్లా కాదు’ అంటూ రజనీకాంత్ చెప్పిన డైలాగ్స్ ట్రైలర్‌కు హైలైట్‌గా నిలిచాయి. కాగా ప్రస్తుతం వేట్టయన్ ట్రైలర్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























