స్వాగ్ పిచ్చెక్కిస్తుంది, ఇది నా ప్రామిస్ – హీరో శ్రీవిష్ణు

Hero Sree Vishnu Reveals Interesting Facts About Swag Movie

కింగ్ ఆఫ్ కంటెంట్ శ్రీవిష్ణు, ట్యాలెంటెడ్ డైరెక్టర్ హసిత్ గోలి అప్ కమింగ్ హిలేరియస్ ఎంటర్‌టైనర్ ‘స్వాగ్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్వాగ్ అక్టోబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపధ్యంలో మేకర్స్ తాజాగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. సినిమా యూనిట్ అంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది. ఇక ప్రీరిలీజ్ ఈవెంట్‌లో హీరో శ్రీవిష్ణు చిత్ర విశేషాలు పంచుకున్నారు.

శ్రీవిష్ణు ఏమన్నారో ఆయన మాటల్లోనే.. “అందరికీ వెల్ కమ్. ‘శ్వాగ్’ సినిమా ‘రాజ రాజ చోర’ ఎడింగ్ కి వచ్చినప్పుడు చేద్దామని అనుకున్నాం. హసిత్‌ ఆరేడు నెలల తర్వాత స్క్రిప్టు పూర్తి చేసి చెప్పాడు. కథ విని ఆశ్చర్యపోయా. చాలా పెద్ద కథ. వంశాలు, తరాలకు సంబంధించిన ఇంత పెద్ద కథను చెప్పడం ఈజీ కాదు. అప్పటికి నేను ఏ సినిమాలోనూ డబుల్ యాక్షన్ చేయలేదు. అలాంటిది ఇందులో నాలుగు పాత్రలు పోషించాలనగానే కొంచెం భయమేసింది.”

“కానీ, హసిత్‌పై నాకు నమ్మకం ఉంది. తను ఎలా హ్యాండిల్ చేస్తారో తెలుసు. దీనికి తోడు డైరెక్షన్ టీం, మా వివేక్ సాగర్, విప్లవ్ వీళ్ళంతా యాడ్ అవ్వడంతో ధైర్యం వచ్చింది. ఎంత మంచి కథైనా తెరకెక్కాలన్నా.. అది ప్రేక్షకుల ముందుకు రావాలన్నా నిర్మాత కావాలి. టీజీ విశ్వ ప్రసాద్‌ గారు వంద కాదు రెండు వందల సినిమాలు చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా. అందులో పది పదిహేను సినిమాలు నాకూ ఇవ్వాలని కోరుకుంటున్నాను.(నవ్వుతూ). అక్టోబర్ 4న ఈ సినిమా గట్టిగా కొట్టబోతోంది.”

విశ్వ గారు, వివేక్ గారు ఈ సినిమాకి చేసిన సపోర్ట్ మర్చిపోలేం. మిగతా సినిమాల కంటే ఈ సినిమాకి ఒక మెట్టు ఎక్కువ కష్టపడ్డాం. చాలా ప్రొస్థటిక్ వర్క్స్ వున్నాయి. నేర్చుకోవడానికి అవకాశం ఇచ్చే సినిమా అని టీం అందరికీ చెప్పాను. సినిమా చాలా ప్యాక్డ్ గా వచ్చింది. ప్యాక్డ్ గా వున్న థియేటర్స్‌లో చూడండి పిచ్చెక్కిపోతుంది. ఇది నా ప్రామిస్. తెలుగు ప్రేక్షకుల ప్రోత్సాహం వల్ల మేం గెలుస్తూ ఉంటాం. ఎన్నో విజయాలు అందించారు. ఈసారి మిమ్మల్ని నేను గెలిపించాలనుకుంటున్నా.”

“దాని కోసం ఎంతో కష్టపడ్డాం. నిజంగా మీకు సినిమా నచ్చితే సినిమా పూర్తయిన తర్వాత రెండు చప్పట్లు కొట్టండి. అంతకంటే ఎక్కువ ఆశించడం లేదు. అలాంటి చప్పట్ల నుంచి ఇన్స్ ఫైరై ఇక్కడిదాక వచ్చాను. ఈ సినిమాలో కథతో పాటు అద్భుతమైన కామెడీ, ప్యూర్ ఎమోషన్ వుంటుంది. చాలా రోజుల పాటు ఇంపాక్ట్ వుండిపోయే సినిమా. సినిమా చూసిన తర్వాత మీ పేరెంట్స్ కి ఫోన్ చేస్తారు. మీరే వాళ్ళని సినిమాకి తీసుకెళతారు. సినిమాని ఎవరూ మిస్ అవ్వరని నమ్ముతున్నాను.”

“సునీల్ గారు రవిబాబు గారు, గోపరాజు గారు అందరూ చాలా మంచి పెర్ఫార్మెన్స్ లు ఇచ్చారు. నేను చేసిన పాత్రలు కూడా చాలా బావొచ్చాయి. రీతుతో పదేళ్ళ తర్వాత వర్క్ చేస్తున్నా, తను మంచి స్టొరీలు సెలెక్ట్ చేస్తుంటుంది. చాలా మంచి పెర్ఫార్మర్. దక్ష చాలా బాగాపెర్ఫారమ్ చేసింది. మీరా జాస్మిన్ గారు నేషనల్ అవార్డ్ విన్నర్. ఈ సినిమాతో కూడా నేషనల్ అవార్డ్ వస్తుంది. ఆవిడకి వస్తుందో సినిమాకి వస్తుందో చూద్దాం (నవ్వుతూ). శరణ్య గారిది గుర్తుండిపోయే పాత్ర. అక్టోబర్ 4న థియేటర్స్ కి వచ్చి మీరు గెలిచి నన్ను గెలిపిస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ థాంక్ యూ” అని అన్నారు హీరో శ్రీవిష్ణు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.