నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస బ్లాక్ బస్టర్ విజయాలతో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఆయన తన 32వ సినిమాగా ‘హిట్: ది థర్డ్ కేస్’లో నటిస్తున్నారు. ఇందులో నాని మోస్ట్ ఇంటెన్స్ క్యారెక్టర్ ని పోషిస్తున్నారు. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యునానిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి వాల్ పోస్టర్ సినిమాపై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే హిట్ ఆఫీసర్‌గా నాని క్యారెక్టర్ ని పరిచయం చేసిన గ్రిప్పింగ్ గ్లింప్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. నాని మేకోవర్, ఇంటెన్స్ స్క్రీన్ ప్రెజెన్స్ అందరినీ సర్ ప్రైజ్ చేసింది. కాగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వైజాగ్‌లో జరుగుతోంది. ఇక ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్ గా కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి నటిస్తున్న విషయం తెలిసిందే.
సినిమాలో శ్రీనిధి శెట్టి పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుందని యూనిట్ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో వైజాగ్‌లో జరుగుతున్న షెడ్యూల్‌లో శ్రీనిధి శెట్టి షూటింగ్‌లో జాయిన్ అయింది. ఈ షెడ్యూల్‌లో లీడ్ పెయిర్- నాని, శ్రీనిధి శెట్టికి సంబంధించిన ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
‘హిట్: ది థర్డ్ కేస్’ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. ప్రముఖ డీవోపీ సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. మిక్కీ జె మేయర్ మ్యూజిక్ సమకూరుస్తున్నారు. ఈ మూవీకి కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్ కాగా, శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో మే 1వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























