భారీ అంచనాల మధ్య నిన్న వచ్చిన దేవర తొలి రోజు నైజాంలో రికార్డు కలెక్షన్స్ ను రాబట్టింది.అక్కడ ఈసినిమా 22.64 కోట్ల షేర్ ను సొంతం చేసుకొని హైయెస్ట్ ఓపెనింగ్స్ ను రాబట్టిన రెండో సినిమా రికార్డు సృష్టించింది.ప్రస్తుతం23.32కోట్ల తో ఆర్ఆర్ఆర్ మొదటి స్థానం లో వుంది. దేవర కొంచెం లో ఆల్ టైం ఓపెనింగ్ రికార్డు ను మిస్ చేసుకుంది.ఇక ఇంతకుముందు సలార్ నైజాంలో 20.57కోట్ల షేర్ తో రెండో స్థానంలో ఉండేది.కేవలం నైజాం లోనే కాదు దేవర మిగితా ఏరియాల్లో సలార్ రికార్డులను బ్రేక్ చేసి నాన్ ఆర్ఆర్ఆర్ రికార్డులు పెట్టింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈరోజు కూడా సాలిడ్ హోల్డ్ తో రన్ ను కొనసాగిస్తోంది.ఇదే జోరు కొనసాగిస్తే వచ్చే వారం లో బ్రేక్ ఈవెన్ ను మార్క్ చేరుకోనుంది.ఇక ఈసినిమా తో ఎన్టీఆర్ రాజమౌళి సెంటిమెంట్ ను కూడా బ్రేక్ చేశాడు.ఏ హీరో అయినా రాజమౌళి తో సినిమా చేశాక ఆతరువాత చేసిన సినిమా డిజాస్టర్ అవుతుందన్న సెంటిమెంట్ ఉండేది.ఇప్పుడు దేవరతో అది కాస్త బ్రేక్ అయ్యింది.
ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ చేతిలో రెండు సినిమాలు వున్నాయి. అందులో వార్ 2 ఒకటి.రీసెంట్ గా ఎన్టీఆర్ ఓ షెడ్యూల్ షూటింగ్ లో పాల్గొన్నాడు.త్వరలోనే మరో షెడ్యూల్ లో జాయిన్ కానున్నాడు.హృతిక్ రోషన్ మరో హీరోగా నటిస్తుండగా అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నాడు.ఇది కాకుండా ఎన్టీఆర్,ప్రశాంత్ నీల్ తో సినిమా చేయనున్నాడు.వచ్చే నెలలో మొదలుపెట్టాలని చూస్తున్నారు.మైత్రి,ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మించనున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: