యంగ్ హీరో శ్రీ విష్ణు- డైరెక్టర్ హసిత్ గోలి కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా స్వాగ్.ఇంతకుముందు ఎవరు టచ్ చేయని పాయింట్ తో వస్తుంది.రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ ,సాంగ్స్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.ఆడవాళ్లపై మగవారి ఆధిపత్యం అనే కాన్సెప్ట్ తో తెరకెక్కుతుంది ఈసినిమా.ఇందులో శ్రీ విష్ణు..రాజు,భవభూతి, సింగ,యయాతి పాత్రల్లో కనిపించనున్నాడు.ఇక ఈసినిమా నుండి తాజాగా 4వ పాట ను విడుదలచేశారు.నీలో నాలో అంటూ సాగే ఈ సాంగ్ కూడా బాగుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమాలో రీతూ వర్మ, మీరా జాస్మిన్,దక్షా నాగర్కర్,శరణ్య ప్రదీప్,సునీల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.తెలుగు రాష్ట్రాలకు గాను ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఈసినిమా థియేట్రికల్ హక్కులను దక్కించుకుంది.
ఇక ఇంతకుముందు శ్రీ విష్ణు – హసిత్ గోలి కాంబినేషన్ లో వచ్చిన రాజ రాజ చోర సూపర్ హిట్ అయ్యింది.మరి ఇప్పుడు ఈ స్వాగ్ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.అక్టోబర్ 4న ఈసినిమా విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























