స్వాగ్ సర్ ప్రైజ్ చేస్తుంది – డైరెక్టర్ హసిత్ గోలి

director hasith goli talks about swag movie

శ్రీవిష్ణు,యంగ్ డైరెక్టర్ హసిత్ గోలి కాంబినేషన్ లో వస్తున్న సినిమా స్వాగ్.ఇంతకుముందు ఈకాంబో లో వచ్చిన రాజ రాజ చోర సూపర్ హిట్ అనిపించుకుంది. దాంతో స్వాగ్ పై అంచనాలు వున్నాయి.పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈసినిమా అక్టోబర్ 4న విడుదలకానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ హసిత్ గోలి మీడియాతో ముచ్చటించాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అచ్చ తెలుగు సినిమా అని చెప్పారు కదా.. మరి ఇంగ్లీష్ టైటిల్ పెట్టడానికి కారణం?

ఈ సినిమా నెరేషన్ విన్న వివేక్ గారు అచ్చ తెలుగు సినిమాలా వుంది, టైటిల్ ఏమిటని అడిగారు.స్వాగ్ అని చెప్పగానే ఆయన సర్‌ప్రైజ్ అయ్యారు.అలా అచ్చ తెలుగు సినిమాలా అనిపించడానికి కారణం వుంది.ఇందులో చాలా రూటెడ్ విషయాలు వుంటాయి.వంశ వృక్షం గురించి అందరికీ తెలిసే ఉంటుంది కానీ అది సినిమాల్లోకి తీసుకురావడం అరుదు.

ఇందులో డిఫరెంట్ జనరేషన్స్ టచ్ చేశాం.సింగా క్యారెక్టర్ ప్రజెంట్ జనరేషన్. అలాగే 90కి సంబంధించిన క్యారెక్టర్ ఉంటుంది.దాని కంటే ముందుకు వెళితే 70కి సంబంధించిన క్యారెక్టర్ ఉంటుంది.ఇంకా ముందుకెళ్తే.. మూల పురుషుడికి సంబంధించినంత వరకు వెళ్దాం అనే ఆలోచనతో చేసిన స్క్రిప్ట్ ఇది.రాజులకు సంబంధించిన క్యారెక్టర్ గురించి చెప్తున్నప్పుడు ఇంగ్లీష్ అవసరం పడదు.అక్కడ స్వచ్ఛమైన తెలుగ ఉంటుంది.ఇందులో అచ్చ తెలుగు విషయాలే ఉన్నాయి. అలాగే రూటెడ్ కల్చర్ ఉంది.ఇది ఒక వంశానికి సంబంధించిన కథ. ప్రతి జనరేషన్‌లో విష్ణు గారి క్యారెక్టర్ ఉంటుంది.

ఇందులో ఏమైనా మెసేజ్ ఇచ్చారా ?

సందేశం కోసం తీసిన సినిమా కాదు ఇది.మగ,ఆడ గొడవ ఎప్పటి నుంచో ఉంది.ఎప్పటికీ ఉంటుంది.ఎప్పటికీ ఉండేది వంశం.ఈ రెండిటిని లింక్ చేసినప్పుడు చాలా ఎక్సైటింగ్‌గా కనిపించింది.మాతృస్వామ్య వ్యవస్థ అనేది అక్కడక్కడ కనిపిస్తుంది.దాన్ని ఎక్స్‌ఫ్లోర్ చేయడం ఇంట్రెస్టింగ్ అనిపించింది.సందేశం కాదు గాని.. తరతరాలుగా మగ,ఆడ గొడవ అనేది ఎలా మారుతూ వచ్చింది,ఇప్పటికి దాని రిలవెన్స్ ఏంటి అనే ఆలోచనతో చేసిన కథ.

యయాతి, భవభూతి క్యారెక్టర్స్ గురించి?

యయాతి పేరు పురాణాలలో ఉన్నదే.యదు వంశానికి సంబంధించిన రాజు.ఈ సినిమాలో పేర్లని రిధమిక్‌గా పెట్టాలని అనుకున్నాం.అందుకే భవభూతి,యయాతి పేర్లని క్యారెక్టర్స్‌కి పెట్టాం.ఇందులో నాలుగు క్యారెక్టర్లకి సేమ్ ఇంపార్టెన్స్ ఉంటుంది.ఆ నాలుగు క్యారెక్టర్స్ కలిసి ఎలాంటి కథ చెప్పబోతున్నారనేది చాలా ఇంట్రెస్టింగ్.

ఈసినిమాలో స్క్రీన్ ప్లే ఎలా ఉండనుంది?

స్క్రీన్ ప్లేలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం.ఈ కథ రాస్తున్నప్పుడే అందరికీ అర్థమయ్యేలా చెప్పాలని అనుకున్నాం.స్క్రీన్ ప్లే చాలా ఎంగేజింగ్‌గా ఉంటుంది. ఆడియన్స్‌కి ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు.స్క్రీన్ ప్లే లీనియర్‌గా వెళ్తూనే చాలా ఎంగేజింగ్‌గా ఉంటుంది .

రీతూ వర్మ క్యారెక్టర్ గురించి?

రీతు గారికి స్ట్రాంగ్ లేడీ స్క్రీన్ పర్సోనా వుంది.వింధ్యామర వంశ రాణిగా కనిపిస్తారు.ఈ క్యారెక్టర్ ని ఆమె చేస్తేనే పర్ఫెక్ట్ అనుకున్నాం చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు.

శ్రీ విష్ణు గారు ఇలాంటి గెటప్స్ తో సినిమా చేయడం ఇదే తొలిసారి కదా ఎలా ప్రిపేర్ అయ్యారు?

శ్రీ విష్ణు గారికే కాదు..మా టీమ్ అందరికీ ఇలాంటి గెటప్స్ తో ఉన్న కథ చేయడం కొత్త. అందరం ఒక ఛాలెంజ్ లా తీసుకుని సినిమా చేశాను.శ్రీ విష్ణు గారు చాలా ఎనర్జిటిక్ గా పెర్ఫార్మ్ చేశారు. విష్ణు గారు కాకుండా ఆయన చేసిన క్యారెక్టర్స్ కనిపించాయి.కథని ముందుకు తీసుకెళ్లడానికే ఎఫర్ట్ పెట్టారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.