భారీ అంచనాల మధ్య దేవర ఈరోజే థియేటర్లలోకి వచ్చింది.పాజిటివ్ రివ్యూస్ కు తోడు మౌత్ టాక్ కూడా బాగానే వుంది.ముఖ్యంగా ఎన్టీఆర్ నటన,అనిరుధ్ సంగీతం గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు.కొన్ని యాక్షన్ సీక్వెన్స్ కూడా అదిరిపోయాయని అంటున్నారు.ఓవరాల్ గా 6ఏళ్ళ తరువాత ఎన్టీఆర్, దేవరతో ఫ్యాన్స్ ఆకలి తీర్చాడు.తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా దేవర 80నుండి 90కోట్ల మధ్య రాబట్టుకునేలా వుంది.రేపు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే వున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా కు వస్తున్న రెస్పాన్స్ చూసి ఎన్టీఆర్ స్పందించాడు.నేను ఎదురుచూస్తున్న రోజు రానేవచ్చింది.మీరు చూపిస్తున్న ఆదరణతో మనసు ఉప్పోగిపోతుంది.కొరటాల శివ గారూ ఇంత మంచి డ్రామాతో దేవరను ఊహించినందుకు ధన్యవాదాలు.నా సోదరుడు అనిరుధ్ మీ సంగీతం మరియు నేపథ్య సంగీతం ఈ ప్రపంచానికి జీవం పోశాయి.నా నిర్మాతలు హరికృష్ణ కొసరాజు,సుధాకర్ మిక్కిలినేని సినిమాకు పిల్లర్స్ గా నిలిచినందుకు ప్రత్యేక ధన్యవాదాలు.కృతజ్ఞతలు… రత్నవేలు సార్, సాబు సిరిల్ సార్ ,శ్రీకర్ ప్రసాద్ మరియు ప్రతి టెక్నీషియన్ కు కూడా వారి అద్భుతమైన పనికి.
దేవర కోసం మీరు జరుపుకుంటున్న వేడుకలను చూడటం నన్ను చాలా ఉప్పొంగేలా చేసింది.మీ ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటా.మీ అందరినీ అలరిస్తూనే ఉంటానని వాగ్దానం చేస్తున్నాను అని ఎక్స్ లో ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు.
ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం అమెరికా లో వున్నాడు. దేవర స్పెషల్ స్క్రీనింగ్ కోసం అక్కడికి వెళ్ళాడు.రేపు ఇండియా రానున్నాడు. ప్రస్తుతం తన చేతిలో రెండు సినిమాలు వున్నాయి.అందులో వార్ 2 ఒకటి.ఆల్రెడీ ఈసినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది.ఇక మరొకటి ప్రశాంత్ నీల్ తో చేయనున్నాడు.ఈ ఏడాది చివర్లో స్టార్ట్ కానుంది.2026 జనవరి 9న విడుదలకానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























