నాచురల్ స్టార్ నాని సరిపోదా శనివారం ఓటిటిలోకి వచ్చేసింది.నెట్ ఫ్లిక్స్ ఈసినిమాను ఈరోజు నుండి స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.తెలుగు తోపాటు తమిళ,కన్నడ ,మలయాళ,హిందీ భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది.ఓటిటిలోకూడా ఈసినిమా పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకుంటుంది.ఇక గత నెలలో థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి నానికి సెకండ్ బిగ్గెస్ట్ హిట్ అందించింది.అలాగే అటు నార్త్ అమెరికా లో 2.5మిలియన్ డాలర్ వసూళ్ల తో నాని కెరీర్ బెస్ట్ గా నిలిచింది.ఈసినిమాతో నాని హ్యాట్రిక్ కూడా కొట్టాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన ఈయాక్షన్ ఎంటర్టైనర్ లో శనివారం మాత్రమే కోపాన్ని చూపెట్టే సూర్య పాత్రలో నాని కనిపించాడు.ఇందులో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించగా ఎస్ జె సూర్య విలన్ గా చేశాడు.తన రోల్ ఈ సినిమాకు హైలైట్ గా నిలిచింది.జేక్స్ బెజాయ్ సంగీతం అందించగా డివివి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య డివివి ఈసినిమాను నిర్మించారు.
ఇక ఈసినిమా తరువాత నాని ప్రస్తుతం హిట్ 3లో నటిస్తున్నాడు.మొదటి షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతుంది.శైలేష్ కొలను ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా వాల్ పోస్టర్ సినిమాపై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు.మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు.ఇంతకుముందు ఈ ప్రాంచైజీ లో వచ్చిన హిట్ ,హిట్ 2 సూపర్ హిట్ అయ్యాయి.దాంతో హిట్ 3 పై మంచి అంచనాలు వున్నాయి.ఇక వీలైనంత తొందరగా ఈ సినిమాను పూర్తి చేసి నాని తన నెక్స్ట్ సినిమాను మొదలు పెట్టాలని చూస్తున్నాడు.దసరా డైరెక్టర్ శ్రీకాంత్ నాని నెక్స్ట్ సినిమాను డైరెక్ట్ చేయనుండగా సుధాకర్ చెరుకూరి నిర్మించనున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























