ఓజీ.. ప్రముఖ సంస్థ చేతికి యూకే రైట్స్

Power Star Pawan Kalyan's OG UK Distribution Rights Acquired by DreamZ Entertainment

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో మళ్ళీ షూటింగులకు హాజరుకాబోతున్నారు. ప్రస్తుతం ఆయన హీరోగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘హరి హరవీరమల్లు’, ‘ఓజీ’ సినిమాలు తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలన్నింటిపై ఇటు పవర్ స్టార్ అభిమానులతో పాటు అటు సాధారణ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలున్నాయి. ఇక పవర్ స్టార్ ఫ్యాన్స్ అయితే ఈ సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో తాజాగా ఓజీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది. ఓజీ మూవీ యూకే పంపిణీ హక్కులను ఓ ప్రముఖ సంస్థ దక్కించుకుంది. డ్రీమ్‌జెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఓజీని యూకేలో రిలీజ్ చేయనుంది. ఈ మేరకు సదరు సంస్థ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. కాగా పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ఈ మూవీ షూటింగ్ త్వరలోనే పునఃప్రారంభం కానుంది.

ఇక పవర్ స్టార్ కూడా తన పోర్షన్‌కి సంబంధించిన కీలక సన్నివేశాలను ఒకేసారి కంప్లీట్ చేసేలా ఒక షెడ్యూల్ ప్లాన్ చేయమని మేకర్స్‌కి సూచించినట్టు సమాచారం. దీనికి తగ్గట్టుగా వారు షూటింగ్ సన్నాహాలు చేస్తున్నారు. అనంతరం పోస్ట్ ప్రొడక్షన్ పనులను వీలైనంత వేగంగా పూర్తిచేసి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని యోచిస్తున్నారు.

కాగా ముంబై బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్‌ డ్రామాగా తెరకెక్కుతోన్న ‘ఓజీ’ సినిమాకు సుజీత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా, బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తుండగా.. ప్రకాష్‌ రాజ్‌, అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే కిక్‌ శ్యామ్‌, వెంకట్‌ బచ్చు, అజయ్‌ ఘోష్‌, మొట్ట రాజేందర్‌, జీవా, హరీష్‌ ఉత్తమన్‌, శాన్‌ కక్కర్‌, అభిమన్యు సింగ్‌, కుమనన్‌ సేతురామన్‌ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత దానయ్య ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.