థియేటర్లలో సెన్సేషన్ సృష్టించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది రీసెంట్ గా వచ్చిన స్త్రీ 2.స్టార్ హీరోల రికార్డులను బ్రేక్ చేస్తూ ఇండియాలో 600కోట్ల వసూళ్లను సాధించి ఆల్ టైం రికార్డు పెట్టింది.ఇప్పటికీ ఈసినిమా డీసెంట్ వసూళ్లను రాబట్టుకుంది.ఇక ఈసినిమా ఇప్పుడు ఓటిటిలోకి వచ్చేసింది.అమెజాన్ ప్రైమ్ ఈరోజు నుండి స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.అయితే రెంట్ బేసిస్ లో ఈసినిమాను అందుబాటులో ఉంచింది.349 రూపాయలు కట్టి ఈసినిమాను చూసేయచ్చు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా నిన్నటి తో దేశ వ్యాప్తంగా 608 కోట్ల నెట్ ను రాబట్టింది.ఇంతకుముందు షారుఖ్ ఖాన్, జవాన్ 584కోట్ల నెట్ తో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమా గా మొదటి స్థానం లో ఉండేది. అయితే ఇప్పుడు స్త్రీ 2 ఊహించని రన్ తో ఆ రికార్డును బ్రేక్ చేసింది.ఇక నెక్స్ట్ ఈ రికార్డు బ్రేక్ చేసే అవకాశం పుష్ప 2కి వుంది.బ్లాక్ బాస్టర్ టాక్ వస్తే అక్కడ ఈ రికార్డు బ్రేక్ చేయడం అసాధ్యమేమీ కాకపోవచ్చు.
హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో స్త్రీకి సీక్వెల్ గా వచ్చిన ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 700కోట్లకు పైగా వసూళ్లను సొంతం చేసుకుంది.ఇందులో శ్రద్దా కపూర్,రాజ్ కుమార్ రావు,పంకజ్ త్రిపాఠి,అభిషేక్ బెనర్జీ కీలక పాత్రల్లో నటించగా అమర్ కౌశిక్ డైరెక్ట్ చేశాడు. ఇక ఈసినిమాకు సీక్వెల్ గా స్త్రీ 3 కూడా రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: