దేవర.. ఓవర్‌సీస్‌ ప్రీ సేల్స్‌లో సరికొత్త రికార్డ్

NTR's New Record in North America with Pre-Sales For Devara

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ భారీ బ‌డ్జెట్ చిత్రం రెండు భాగాలుగా రూపొందుతుండగా.. తారక్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ జాన్వీ క‌పూర్ కథానాయికగా కనిపించనుంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ‘భైరా’ అనే విలన్‌ పాత్రలో కనిపించనుండగా.. ప్ర‌కాష్ రాజ్‌, శ్రీకాంత్‌, షైన్ టామ్ చాకో, అజ‌య్, గెట‌ప్ శీను త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ నుండి ఇప్పటివరకూ రిలీజైన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంది. ట్రైలర్ మరియు రిలీజ్ ట్రైలర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేశాయి. మరోవైపు ప్రీ సేల్స్‌లో ఇండియాలోనే కాకుండా ఓవర్‌సీస్‌లో సైతం జోరు చూపిస్తోంది. దీంతో దేవరపై విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. తారక్ అభిమానులతోపాటు మూవీ లవర్స్ అందరూ ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ ప‌తాకాల‌పై మిక్కిలినేని సుధాక‌ర్‌, హ‌రికృష్ణ‌.కె నిర్మించిన దేవర పార్ట్ 1 ప్ర‌పంచ వ్యాప్తంగా సెప్టెంబ‌ర్ 27న తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌లయాళ భాష‌ల్లో గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో దేవర ఈ క్రమంలో ఓవర్సీస్​లో ప్రీ సేల్స్‌ ఓపెన్ చేయగా అక్కడ జోరు చూపిస్తోంది. ఇంతకుముందెన్నడూ లేనివిధంగా సరికొత్త రికార్థులు సృష్టిస్తోంది.

ఇప్పటికే కేవలం ఒక్క నార్త్ అమెరికాలోనే ప్రీసేల్‌ బుకింగ్స్‌లో అత్యంత వేగంగా 1 మిలియన్‌ డాలర్ల మార్క్‌ను అందుకున్న దేవర, తాజాగా 2.5 మిలియన్‌ డాలర్ల మార్క్‌ను చేరుకుంది. ఈ క్రమంలో ప్రభాస్ రికార్డును కూడా బీట్ చేసేసింది. తద్వారా ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ నటుడిగా ఎన్టీఆర్ సరికొత్త రికార్డ్ నెలకొలపాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా చిత్ర యూనిట్ అఫీషియల్​గా అనౌన్స్ చేసింది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.