కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర డైరెక్ట్ చేస్తూ నటిస్తున్న సినిమా యూఐ.రీసెంట్ గా ఈసినిమా నుండి వచ్చిన టీజర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.ఇక ఈరోజు ఉపేంద్ర బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుండి పవర్ ఫుల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.ఈపోస్టర్ లో ఉపేంద్ర హార్స్ పై కూర్చొని ఇంటెన్స్ లుక్ లో కనిపించాడు.ఉపేంద్ర కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది ఈసినిమా.అక్టోబర్ లో థియేటర్లలోకి తీసుకురానున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ చిత్రంలో రీష్మా నానయ్య ,నిధి సుబ్బయ్య,మురళీ శర్మ ,పి రవిశంకర్ కీలక పాత్రల్లో నటిస్తుండగా లహరి ఫిల్మ్స్, జి మనోహరన్ అలాగే వీనస్ ఎంటర్టైనర్స్, కెపీ శ్రీకాంత్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
ఇక ఈసినిమా కాకుండా ఉపేంద్ర, కూలీ సినిమాలో పవర్ ఫుల్ రోల్ లో నటించడానికి అంగీకరించాడు.లోకేష్ కనగరాజ్ ఈసినిమాను తెరకెక్కిస్తుండగా సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్నాడు.ఉపేంద్ర తోపాటు కింగ్ నాగార్జున ,శృతి హాసన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ వైజాగ్ లో జరుగుతుంది.త్వరలోనే ఉపేంద్ర ఈసినిమా షూటింగ్ లో జాయిన్ కానున్నాడు.అనిరుధ్ సంగీతం అందిస్తుండగా సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: