యంగ్ టైగర్ ఎన్టీఆర్ టైటిల్ రోల్ పోషిస్తున్న తాజా చిత్రం ‘దేవర’. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ మోస్ట్ అవైటెడ్ మూవీలో తారక్ డ్యూయెల్ రోల్స్ పోషిస్తున్నారు. దేవర నుంచి ఇప్పటివరకూ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ సూపర్ రెస్పాన్స్ అందుకుంది. అలాగే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన పాటలన్నీ చార్ట్ బస్టర్‌గా నిలిచాయి. ఇక రీసెంట్‌గా ముంబైలో ట్రైలర్‌ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రపంచ వ్యాప్తంగా ఈ ట్రైలర్‌కు ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. అన్నీ భాషల్లో కలిపి మిలియన్స్ వ్యూస్‌తో ట్రైలర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో ఇప్పటికే సినిమాపై ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ నెక్ట్స్ లెవల్‌కు చేరుకున్నాయి. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా విడుదలకు ముందే అనేక సంచలనాలను క్రియేట్ చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 27న దేవర చిత్రం తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది.
ఈ నేపథ్యంలో మేకర్స్ ఇప్పటికే ఓవర్‌సీస్‌లో ప్రీ సేల్స్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేవర ఆస్ట్రేలియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. విడుదలకు ఇంకా వారానికి పైగా సమయం ఉన్నప్పటికీ అప్పుడే 150K ఆస్ట్రేలియన్ డాలర్స్ వసూలు చేసింది. ఈ మేరకు మేకర్స్ సోషల్ మీడియాలో వెల్లడించారు. ఇక ప్రీ సేల్స్‌లో దేవర జోరు చూస్తుంటే మూవీ రిలీజ్ లోపు మరిన్ని రికార్డులు అందుకునేలా కనిపిస్తోంది.
దేవరలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్‌గా కనిపించనున్నారు. అలాగే ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, అజయ్, గెటప్ శీను తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె దేవర చిత్రాన్ని నిర్మించారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: