మత్తువదలరా 2 కు ఈ రేంజ్ రెస్పాన్స్ ఊహించలేదు- డైరెక్టర్ రితేష్ రానా

Ritesh Rana talks about Mathu vadalara 2

శ్రీ సింహ ,సత్య లీడ్ రోల్స్ లో రితేష్ రానా దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మత్తువదలరా2 బాక్సాఫీస్ వద్ద అదరగొడుతుంది.ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి హిట్ అనిపించుకున్న ఈసినిమా బ్లాక్ బాస్టర్ వైపు పరుగులు పెడుతుంది.ఈ సందర్భంగా డైరెక్టర్ రితేష్ రానా విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మత్తువదలరా 2తో పెద్ద హిట్ కొట్టారు.. కంగ్రాట్యులేషన్స్

థాంక్ యూ.

చిరంజీవి గారు, మహేష్ బాబు గారు ఈ సినిమా చూసి రివ్యూ ఇవ్వడం ఎలా అనిపించింది?

అది చాలా సంతోషాన్ని ఇచ్చింది. చిరంజీవి గారు, మహేష్ గారు ట్వీట్ చేయడం బెస్ట్ మెమరీ.

సీక్వెల్ చేయాలనే ఆలోచన మొదటి నుంచి ఉందా ?

సీక్వెల్ చేయాలని నిర్మాత చెర్రీ గారు ఎప్పటినుంచో అన్నారు.అయితే ఆర్గానిక్ గా ఓ మంచి ఐడియా వస్తేనే చేయాలి. అలాంటి ఐడియా క్రాక్ చేసి చెర్రీ గారికి, టీంకి చెప్పాను అది అందరికీ నచ్చింది.మేము అనుకున్నట్లే వర్క్ పుట్ అయ్యింది ఆడియన్స్ సినిమాని చాలా ఎంజాయ్ చేస్తున్నారు.మేము ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ రావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.

సత్య చేసిన పదహారేళ్ళ వయసు సాంగ్ ముందే ప్లాన్ చేశారా ?

అది ఫస్ట్ పార్ట్ లో తీసింది.అప్పుడు లెంగ్త్ ఎక్కువైందని కట్ చేశాం.సెకండ్ పార్ట్ లో మళ్ళీ అలాంటి సిట్యువేషన్ వచ్చినపుడు అది ప్లేస్ చేశాం.థియేటర్స్ లో చాలా ఎంజాయ్ చేస్తున్నారు.

అసలు ఈ స్లేవ్ డ్రగ్ కాన్సెప్ట్ ఏంటి ?

స్లేవ్ డ్రగ్ ని ఒక మెటాఫర్ లా వాడం.మత్తు అనేది కేవలం నార్కోటిక్స్ నే కాదు.మత్తు చాలా రకాలుగా వుంది.మత్తు నుంచి బయటపడటం మంచిదని చెప్పడం దాని ఉద్దేశం.

సింహ,సత్య క్యారెక్టరైజేషన్ గురించి ?

బాబు, యేసు ఈక్వెల్ క్యారెక్టరైజేషన్స్. బాబు లేకపోతే యేసు క్యారెక్టర్ అంతగా పండదు.ఫారియా కూడా అద్భుతంగా చేశారు. ఆమెని ద్రుష్టిలో పెట్టుకునే ఆ క్యారెక్టర్ రాశాను. తను ఈ సినిమాకి ఒక ర్యాప్ సాంగ్ చేశారు.అది మూవీ ప్రమోషన్స్ కి యూజ్ అయ్యింది.

చెర్రీ గారి వర్క్ ఎక్స్ పీరియన్స్ గురించి ?

వెరీ హ్యాపీ. ఇప్పటి వరకూ అన్నీ సినిమాలు ఆయనతోనే చేశాను, జస్ట్ లైక్ ఏ ఫాదర్ ఫిగర్. ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే సెకండ్ పార్ట్ కి ఎక్కువ బడ్జెట్ అయ్యింది.ఎక్కడ రాజీ పడకుండా సినిమాని నిర్మించారు.

సినిమా చూశాక రాజమౌళి గారి రియాక్షన్ ఏంటి ?
-రాజమౌళి గారికి సినిమా చాలా నచ్చింది.చాలా ఎంజాయ్ చేశారు.

సినిమాకి మ్యూజిక్ చాలా హెల్ప్ అయ్యింది కదా, మీరు ఎలాంటి ఇన్ పుట్స్ ఇచ్చారు?
-కాల భైరవతో మంచి సింక్ కుదిరిపోయింది.ఇన్ పుట్స్ ఏమీ ఇవ్వను.నేను సినిమా రీల్స్ పంపిస్తా.తను మ్యూజిక్ చేసి పిలుస్తారు.

పార్ట్ 3 ఎప్పుడు ?
-ఐడియాస్,ప్లేస్ మెంట్స్ వున్నాయి.వాటిని ఇంకా డెవలప్ చేయాలి.ఇంకో సినిమా చేసిన తర్వాత పార్ట్ 3 వుంటుంది.నెక్స్ట్ సినిమా కూడా చెర్రీ గారితోనే చేస్తాను.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.