యువ కథానాయకుడు శ్రీవిష్ణు, మహిమా నంబియార్ జంటగా నటించిన లేటెస్ట్ వినోదాత్మక చిత్రం ‘కామ్రేడ్ కళ్యాణ్’ సరికొత్తగా డిజిటల్ వీక్షకులను అలరించడానికి వచ్చేసింది. జానకిరామ్ మారెళ్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే ఈరోజే ప్రముఖ డిజిటల్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
థియేటర్లలో విడుదలైన కేవలం 21 రోజుల్లోనే ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి రావడం విశేషం. 1990వ దశకంలో ఆంధ్రా-ఒడిశా సరిహద్దు నేపథ్యంలో సాగే ఈ కథలో శ్రీవిష్ణు మార్క్ కామెడీ, ఆకట్టుకునే ఎమోషన్స్ ప్రేక్షకులను బాగా అలరించాయి.
రాధికా శరత్‌కుమార్, షైన్ టామ్ చాకో, సత్య, వెన్నెల కిశోర్ వంటి సీనియర్ నటీనటులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని థియేటర్లలో మిస్ అయినవారు ఇప్పుడు ఇంట్లోనే హ్యాపీగా వీక్షించవచ్చు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























