దళపతి విజయ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న 69వ సినిమా అప్డేట్ రేపు రానుంది.రేపు సాయంత్రం 5గంటలకు రివీల్ చేయనున్నామని సినిమాను నిర్మించనున్న కేవీఎన్ ప్రొడక్షన్స్ అనౌన్స్ చేసింది.ఈసందర్భంగా ఓ వీడియో ను కూడా విడుదలచేసింది.ఇందులో విజయ్ ఫ్యాన్స్.. విజయ్ గురించి చెప్పడం చాలా ఎమోషనల్ గా అనిపించింది.వన్ లాస్ట్ టైం పేరిట ఈ వీడియోను రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
విజయ్ కి ఇదే చివరి సినిమా కానుంది.ఆతరువాత సినిమాలకు గుడ్ బై చెప్పి పొలిటికల్ గా బిజీ కానున్నాడు.ఇప్పటికే పార్టీ కూడా పెట్టిన విషయం తెలిసిందే.దాంతో విజయ్ చివరి సినిమా ఫ్యాన్స్ గుర్తిండిపోయేలా తెరకెక్కనుంది.ఇక ఈసినిమాలో నటించే తారాగణం వీరే అంటూ కొన్ని పేర్లు ప్రచారం లో వున్నాయి.అందులో భాగంగా మోహన్ లాల్ ,సమంత ,మామితా బైజు ను తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి.అయితే రేపు కాస్టింగ్ గురించి కూడా క్లారిటీ వచ్చే అవకాశం వుంది.
ఇదిలావుంటే రీసెంట్ గా ది గోట్ తో ప్రేక్షకులముందుకు వచ్చాడు విజయ్.ఈసినిమా ప్రస్తుతం తమిళనాడులో అదరగొడుతుంది.ఫుల్ రన్ లో అక్కడ 150 కోట్ల మార్క్ ను క్రాస్ చేయనుంది.ఓవరాల్ గా నిన్నటి వరకు 350కోట్ల వసూళ్లను రాబట్టుకుంది.వెంకట్ ప్రభు ఈసినిమాను డైరెక్ట్ చేయగా విజయ్ ఇందులో డ్యూయెల్ రోల్ లో కనిపించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: