సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బాలకృష్ణ కుమార్తె తేజస్విని

Nandamuri Balakrishna's Daughter Tejaswini Meets Telangana CM Revanth Reddy

ఇటీవల కురిసిన ఎడతెరిపిలేని వర్షాలకు ఉభయ తెలుగు రాష్ట్రాలలో భారీ వరదలు సంభవించిన విషయం తెలిసిందే. దీంతో చాలా ప్రాంతాలు జలమయం అవడంతో ఆయా ప్రాంతాల ప్ర‌జ‌లు చాలా క‌ఠిన‌మైన ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్నారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు సహాయక చర్యలు ముమ్మురంగా కొనసాగిస్తున్నాయి. బాధితులను పునరావాసాలకు తరలించడం, ఆహార పొట్లాలు అందించడం వంటివి విరివిగా చేపట్టాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో త‌న పెద్ద మ‌న‌సుని, మాన‌వ‌త్వాన్ని చాటుకున్నారు టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ. తనను ఎంతగానో అభిమానించే తెలుగు రాష్ట్రాల ప్రజలు కష్ట సమయంలో ఉన్నప్పుడు వారికి అండగా ఉండటం బాధ్యతగా భావించిన బాలకృష్ణ తన ఉదారతను చాటుకున్నారు. తన వంతు బాధ్యతగా ఆయన రెండు తెలుగు రాష్ట్రాలకు ఒక్కో దానికి రూ.50 లక్షలు చొప్పున రూ.1 కోటి భారీ విరాళం ప్రటించారు.

ఈ మొత్తాన్ని ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేయనున్నట్టు ఓ పత్రికా ప్రకటన ద్వారా వెల్లడించారు. ఈ క్రమంలో బాలకృష్ణ తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును కలుసుకుని రూ.50 లక్షలు చెక్కును అందజేశారు. మరోవైపు ఆయన చిన్న కుమార్తె నందమూరి తేజస్విని నేడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా వరద బాధితుల సహాయర్ధం తండ్రి బాలకృష్ణ తరపున ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50 లక్షలు విరాళంగా అందించారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.