తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ది గోట్ ( ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం ) మొదటి వారంలో సెన్సేషనల్ వసూళ్లను సొంతం చేసుకుంది.నిన్నటితో ఫస్ట్ వీక్ రన్ కంప్లీట్ కాగా ప్రపంచ వ్యాప్తంగా 330కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.ఫుల్ రన్ లో 400కోట్ల క్లబ్ లో చేరనుంది.ముఖ్యంగా తమిళనాడులో ఈసినిమా స్ట్రాంగ్ హోల్డ్ ను కొనసాగిస్తోంది.వారం రోజుల్లో అక్కడ 130కోట్లకు పైగా వసూళ్లను ఖాతాలో వేసుకుంది.ఈవారాంతంలో బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేయనుంది.ప్రస్తుతానికి బాక్సాఫీస్ వద్ద పోటీ లేకపోవడం ది గోట్ కు అడ్వాంటేజ్ అయ్యింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక గోట్ హిందీ వెర్షన్ కు కూడా డీసెంట్ వసూళ్లను రాబట్టుకుంటుంది.వారం రోజుల్లో 12.5 కోట్ల వసూళ్లను సొంతం చేసుకుంది.దాంతో అత్యధిక వసూళ్లను రాబట్టిన 9వ తమిళ హిందీ డబ్బింగ్ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.అటు ఓవర్సీస్ లో ఈసినిమా 100 కోట్లకుపైగా వసూళ్లను సాధించి బ్రేక్ ఈవెన్ మార్క్ కు దగ్గర్లో వుంది.
వెంకట్ ప్రభు తెరకెక్కించిన ఈసినిమాలో విజయ్ డ్యూయెల్ రోల్ లో నటించగా స్నేహ,మీనాక్షి చౌదరి,ప్రశాంత్,ప్రభుదేవా,అజ్మల్, లైలా,మీనాక్షి చౌదరీ,యోగిబాబు,వీటీవీ గణేష్,జయరామ్ కీలక పాత్రల్లో కనిపించారు.యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు.400కోట్ల బడ్జెట్ తో ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ నిర్మించింది.
ఇక విజయ్ తన 69వ సినిమాను వినోత్ తో చేయనున్నాడు.విజయ్ కు ఇదే చివరి సినిమా కానుంది.ఆతరువాత పొలిటికల్ గా బిజీ కానున్నాడు.ప్రస్తుతం తన నెక్స్ట్ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.త్వరలోనే అనౌన్స్ మెంట్ రానుంది.ఈసినిమా పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: