మాచో స్టార్ గోపీచంద్ హీరోగా ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న తాజా చిత్రం ‘విశ్వం’. ఈ క్రేజీ కాంబో నుంచి ఈద్ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ స్ట్రైక్ వీడియో ఆడియెన్స్ కి మాస్ ఫీస్ట్‌ని అందించింది. గోపీచంద్ 32వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై వేణు దోనేపూడి నిర్మిస్తుండగా.. రీసెంట్‌గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మాణ భాగస్వామిగా చేరిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
శ్రీను వైట్ల కెరీర్‌లోని ఎన్నో బ్లాక్‌బస్టర్స్‌లో భాగస్వామ్యం ఉన్న స్క్రీన్ రైటర్ గోపీ మోహన్ ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో కావ్య థాపర్ కథానాయికగా.. నరేష్, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 11న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో విశ్వం ప్రమోషన్స్‌ను కిక్ స్టార్ట్ చేస్తూ మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను తాజాగా రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ శ్రీను వైట్ల మాట్లాడుతూ.. “ప్రేక్షకులు నా నుంచి ఏం కోరుకుంటారో మారుతున్న టైమ్ ని ద్రుష్టిలో పెట్టుకొని ఒక ఫ్రెష్ థీమ్, చాలా లేయర్స్ తో ప్రాపర్ బ్లెండ్ తో చేసిన కమర్షియల్ సినిమా ఇది. వేణు దోనేపూడి గారితో సినిమా స్టార్ట్ అయ్యింది. తర్వాత విశ్వగారు స్ట్రాంగ్ సపోర్ట్ గా వచ్చారు. వారికి థాంక్ యూ. అవుట్ పుట్ చూసి అందరూ హ్యాపీగా వున్నారు. నాకు సపోర్ట్ ఇచ్చిన గోపిచంద్ గారికి థాంక్ యూ” అని తెలిపారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “హీరోయిన్ కావ్య థాపర్ ఎనర్జిటిక్ గా చేసింది. చాలా పెద్ద స్కేల్ వున్న ఫిలిం ఇది. నా గత సినిమాలకి మించి ఇందులో హిలేరియస్ కామెడీ వుంటుంది. దసరాకి ఫ్యామిలీ అంతా కలసి ఎంజాయ్ చేశాలా వుంటుంది. చేతన్ ఈ సినిమాకి చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. గుహన్ అద్భుతమైన కెమరా వర్క్ ఇచ్చాడు. ఇటలీ లోని రోమ్, మిలాన్, సర్జినియా, గోవా, హిమాచల్ ప్రదేశ్.. ఇలా చాలా ప్లేసెస్ లో షూట్ చేశాం. గుహన్ సపోర్ట్ తో ఈజీగా చేయగలిగాను. అందరికీ పేరుపేరునా థాంక్ యూ” అని అన్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: