కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

కంగువ.. ఓవర్సీస్‌లో రిలీజ్ చేసేది ఎవరంటే..?

Kanguva Overseas Distribution Rights Acquired by Phars Film

కంగువ.. ఓవర్సీస్‌లో రిలీజ్ చేసేది ఎవరంటే..?

Kanguva Overseas Distribution Rights Acquired by Phars Film

Kanguva Overseas Distribution Rights Acquired by Phars Film

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధానపాత్రలో నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కంగువ’. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌‌లో రూపొందుతోంది. ఇందులో దిశా పటాని హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాబీడియోల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. రాక్‌ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇంతకుముందు సూర్య నటించిన 'సింగం' సిరీస్‌కు దేవినే సంగీతం అందించిన విషయం తెలిసిందే.

ఇక సూర్య 42వ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రంలో సూర్య పలు గెటప్స్‌లో కనిపించనున్నారు. ఇప్పటికే ‘కంగువ’ నుంచి రిలీజైన మూవీ గ్లింప్స్ ‌వీడియో, పోస్టర్స్, ఫస్ట్ సింగిల్ ఫైర్ సాంగ్ టీజర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి. అలాగే అభిమానులు ఎప్పటినుండో ఎదురుచూస్తున్న కంగువ మూవీ ట్రైలర్ ఇటీవలే రిలీజై సూపర్ రెస్పాన్స్ అందుకుంది.

టీజర్, ట్రైలర్ రెండింటిలో సూర్య నట విశ్వరూపాన్ని చూపించాడనే చెప్పొచ్చు. ముఖ్యంగా ట్రైబల్‌ క్యారక్టర్‌లో అదరగొట్టేశాడు. చూడటానికి భీతిగొలిపేలా ఉన్న ఈ పాత్రను ఆయన తప్ప మరెవ్వరూ చేయలేరు అనేట్టుగా నటించాడు. ఇక ఇదిలావుంటే, తాజాగా ఈ మూవీ నుంచి ఓ క్రేజీ అప్‌డేట్ వచ్చింది. కంగువ చిత్రం ఓవర్సీస్‌ రైట్స్‌ను 'ఫార్స్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్' సంస్థ దక్కించుకుంది. ఈ మేరకు సోషల్ మీడియాలో మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమా సుమారు 1000 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్‌తో పాటు టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ సంస్థ యూవీ క్రియేషన్స్ కూడా కలిసి నిర్మిస్తోంది. అక్టోబర్ 10న దసరా పండుగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా మొత్తం 10 భాషల్లో 3డీ వర్షెన్‌లో విడుదల కానుంది. ఈ సినిమాను నైజాం ఏరియాలో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేయబోతున్నారు.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్